AP Local Body Elections 2021: కరోనా వైరస్ (CoronaVirus) వ్యాప్తి కారణంగా ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు (AP Local Body Elections) వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ విషయంలో ఏపీలోని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (AP State Election Commissioner)కు మధ్య రాజుకున్న వివాదం ఇంకా సమసిపోలేదు. కోర్టు ఆదేశాలలో మరోసారి ఏపీ ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన దూకుడు కొనసాగిస్తున్నారు. ఏపీలో స్థానిక ఎన్నికలు జరిగి తీరాల్సిందే అంటున్నారు.
Also Read: AP: ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించలేమని హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన ప్రభుత్వం
స్థానిక సంస్థల ఎన్నికలు (AP Local Body Elections) నిర్వహణకు కరోనా వైరస్ ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డంకి కాదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ (Nimmagadda Ramesh Kumar) పేర్కొన్నారు. ఫిబ్రవరి 2021లో ఏపీలో స్థానిక ఎన్నికలు నిర్వహించడం సాధ్యమేనని రాష్ట్ర ప్రభుత్వ వాదనపై హైకోర్టు ఆదేశాల మేరకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గురువారం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. ఇటీవల తెలంగాణ, బిహార్, రాజస్థాన్ రాష్ట్రాలు స్థానిక సంస్థల ఎన్నికలను విజయవంతంగా నిర్వహించాయని తన అఫిడవిట్‌లో హైకోర్టుకు తెలిపారు.
Also Read: EPFO: పీఎఫ్ ఖాతాలో వడ్డీ ఎప్పుడు జమకానుందో తెలుసా?
కాగా, కరోనా వ్యాక్సినేషన్‌కు స్థానిక ఎన్నికలు అడ్డంకిగా మారతాయని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. అయితే కరోనా వ్యాక్సిన్ వినియోగానికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేర్కొన్నారు. కరోనా వ్యాక్సినేషన్‌కు విధివిధానాలు సైతం ఖరారుకాలేదని, అలాంటప్పుడు ఎన్నికల నిర్వహణకు వ్యాక్సినేషన్ అడ్డంకిగా మారుతుందనే సమస్యనే లేదన్నారు.
Also Read: Gold Price Today 18th December 2020: బంగారం ధరలు మళ్లీ జంప్.. షాకిచ్చిన వెండి!
ఆర్టికల్ 14 కింద ఏపీ ప్రభుత్వానికి పిటిషన్ దాఖలు చేసే హక్కు లేదని, కేవలం వ్యక్తులకు వర్తించే ఆర్టికల్ మీద పిటిషన్లు దాఖలు చేస్తున్నారని ఏపీ ప్రభుత్వానికి కౌంటర్ ఇచ్చారు. 2021 ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలు నిర్వహించడానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇచ్చిన ప్రొసీడింగ్ ఉత్తర్వులపై పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై రాష్ట్ర ఎస్‌ఈసీ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు.
Also Read: Postal Life Insurance Benefits: పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ చేస్తే కలిగే ప్రయోజనాలివే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe