Asani Cyclone Update: అసని తుపాను ముప్పుతిప్పలు పెడుతోంది. ఐఎండీ అంచనాల్ని తలకిందులు చేస్తోంది. ఉత్తరాంధ్ర నుంచి హఠాత్తుగా దిశ మార్చుకుని..దక్షిణాంధ్రవైపుకు కదిలింది.
అసనీ తుపాను ముందు నుంచీ ఊహించని పరిణామాలకు గురి చేస్తోంది. తొలుత సాధారణ తుపానుగా అంచనా వేయగా..రూపం మార్చుకుని తీవ్ర తుపానుగా మారింది. ఆ తరువాత మద్యాహ్నం వరకూ అసనీ తుపాను ఉత్తరాంధ్రవైపుకు ఒడిశా దిశగా గంటకు 12 కిలోమీటర్ల వేగంతో దూసుకురావడంతో..ఉత్తరాంధ్ర సమీపంలో తీరం దాటుతుందని ఐఎండీ అంచనా వేసింది.
అయితే ఉన్నట్టుండి దిశ మార్చుకుంది. అది కూడా పూర్తి వ్యతిరేక దిశలో మార్చుకుంది. ఉత్తర కోస్తా నుంచి దక్షిణ కోస్తావైపుకు మారింది. ప్రస్తుతం అసనీ తుపాను మచిలీపట్నం-బాపట్ల తీరాల మధ్య కేంద్రీకృతమై ఉంది. రేపు సాయంత్రానికి మచీలీపట్నం వద్ద తీరం తాకనుంది. ఆ తరువాత మచిలీపట్నం నుంచి విశాఖ వరకూ భూభాగం మీదుగా..తిరిగి సముద్రంలో ప్రవేశించే అవకాశాలున్నాయని తాజాగా ఐఎండీ అంచనా వేస్తోంది.
తుపాను గమనం దక్షిణ కోస్తావైపుకు కదలడంతో ప్రస్తుతం ఒంగోలు, బాపట్ల, తిరుపతి జిల్లాల్లో వర్షాలు ప్రారంభమయ్యాయి. మచిలీపట్నం తీర ప్రాంతంలో భారీ ఈదురుగాలులు వీయనున్నాయి. తుపాను కారణంగా ఒంగోలు, అద్దంకి, మచిలీపట్నం, దివిసీమ ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు పడనున్నాయి. తీరం వెంబడి గంటకు 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి.
పది జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
అసనీ తుపాను కారణంగా ఏపీలోని పది జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఈ జిల్లాల్లో రానున్న 48 గంటల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడనున్నాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా కృష్ణ, గుంటూరు జిల్లాల్లో పరిస్థితి దారుణంగా ఉండనుంది. ఇక శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కోనసీమ, తూర్పు గోదావరి, కాకినాడ, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య కడప జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ అయింది.
రేపు, ఎల్లుండ మాత్రం కృష్ణా, విజయవాడ, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కోనసీమ, కాకినాడ, తూర్పు గోదావరి, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో రెడ్ అలర్ట్ ఉంటుంది. అసనీ తుపాను వేగం కూడా గంటగంటకూ మారుతోంది. తీరం దాటే సమయంలో తుపాను మరింత తీవ్రం కావచ్చనేది ఓ అంచనా.
Also read: Cyclone Asani Update Today: దిశమార్చుకున్న అసని తీవ్ర తుపాను..తీరం దాటేది ఎక్కడంటే ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook