Bank Employees 2 Days Weekly Off: బ్యాంక్ ఉద్యోగులకు త్వరలోనే శుభవార్త రాబోతుందా..? ఎప్పటినుంచో కోరుకుంటున్నట్లు వారానికి రెండు వీక్లీఆఫ్‌లు అమలుకానున్నాయా..? ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ), యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ మధ్య జరుగుతున్న చర్చలు అదే దిశగా సాగుతున్నాయి. పని గంటలు పెంచి.. వీక్లీ ఆఫ్‌లు రెండు ఇచ్చేలా యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న పని గంటలకు మరో 40 నిమిషాలు పెంచే యోచనలో ఉన్నారు.
ఈ విషయంలో ఐబీఏ, యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ మధ్య ఒప్పందం కుదిరింది. ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఎస్.నాగరాజన్ మాట్లాడుతూ.. బ్యాంకులలో ఐదు రోజుల పని నియమాన్ని అమలు చేయాలంటే.. ప్రభుత్వం సెక్షన్ 25 కింద నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంటుదని అన్నారు. నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ చట్టం చేయవలసి ఉంటుందన్నారు. ప్రస్తుతం బ్యాంకులకు రెండో, నాల్గవ శనివారాల్లో సెలవు ఉన్న విషయం తెలిసిందే.
ప్రతి శనివారం సెలవు డిమాండ్‌ను ప్రభుత్వం అంగీకరిస్తే.. బ్యాంకు ఉద్యోగులు వారానికి మిగిలిన ఐదు రోజులు ఎక్కువ పని చేయాల్సి ఉంటుందని ఎస్.నాగరాజన్ అన్నారు. దీనికి ఆమోదం లభిస్తే బ్యాంకు ఉద్యోగులు సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 9.45 నుంచి 5.30 వరకు పని చేయాల్సి ఉంటుందన్నారు. ప్రతిరోజూ పనిలో 40 నిమిషాల పెరుగుదల ఉంటుందని చెప్పారు.
ప్రస్తుతం బ్యాంకులు మొదటి, మూడవ శనివారాలు పని చేస్తాయి. అయితే మధ్యమధ్యలో బ్యాంకు సెలవుల విషయంలో ఖాతాదారులకు చాలాసార్లు చాలా గందరగోళానికి గురవుతున్నారు. బ్యాంకు యూనియన్లు చాలా కాలంగా 5 పని దినాల కోసం డిమాండ్ చేస్తుండగా.. ఇంకా ఆమోదం లభించలేదు. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ప్రభుత్వం 5 పనిదినాల నిబంధనను అమలు చేసినప్పటి నుంచి ఈ డిమాండ్ నిలిచిపోయింది.
Also Read: Election Results 2023: ఈశాన్యంలో కాషాయ రెపరెపలు.. మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఇలా..
Also Read: Pawan Kalyan: వైసీపీ ప్రభుత్వానికి జనసేన సపోర్ట్.. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం: పవన్ కళ్యాణ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి