Best Recharge Plan: దేశంలోని ప్రైవేట్ టెలీకం కంపెనీలు రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియాలతో పోలిస్తే బీఎస్ఎన్ఎల్ రీఛార్జ్ ప్లాన్స్ చాలా చౌకగా ఉంటాయి. ఇప్పుడు మరో చీప్ అండ్ బెస్ట్ రీఛార్జ్ ప్లాన్ ప్రవేశపెట్టింది. కేవలం 99 రూపాయలకే రోజుకు 1.5 జీబీ డేటా ఇచ్చే ప్లాన్ ఇది. కళ్లు చెదిరే ఆఫర్లతో ఉన్న ఈ ప్లాన్ వివరాలు తెలుసుకుందాం.
బీఎస్ఎన్ఎల్ తాజాగా ప్రవేశపెట్టిన రీఛార్జ్ ప్లాన్ బీఎస్ఎన్ఎల్ 99 రూపాయల రీఛార్జ్ ప్లాన్. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 17 రోజులు ఉంటుంది. కానీ అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఉంటాయి. అంతేకాకుండా రోజుకు 1.5 జీబీ డేటా లభిస్తుంది. కస్టమైజ్డ్ పర్సనల్ రింగ్ బ్యాక్ టోన్ ఉచితంగా పొందవచ్చు. అంటే ఇతర కంపెనీలకు ఖర్చుపెట్టే డబ్బుల కంటే తక్కువకు కేవలం 200 రూపాయలకు 34 రోజుల వ్యాలిడిటీ అందుతుంది. ఇక మరో ప్లాన్ 147 రూపాయలకు లభిస్తుంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులు కాగా అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌ల సౌకర్యం ఉంటుంది. ఇంటర్నెట్ డేటా మాత్రం నెల రోజులు 10 జీబీ లభిస్తుంది. డేటా పెద్దగా అవసరం లేనివారికి ఇది బెస్ట్ ప్లాన్. దీంతో పాటు ఫ్రీ కాలర్ ట్యూన్స్ ఆప్షన్ ఉంటుంది. 10 జీబీ డేటా నెలలో ఎప్పుడైనా వాడుకోవచ్చు.
Also read: AP Summer Effect: ఏపీలో పెరుగుతున్న ఉక్కపోత, ఈ వేసవి తీవ్రమేనా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి