Today Gold and Silver Rates: బంగారం ధరలు ఆకాశమే హద్దుగా రాకెట్ కన్నా వేగంగా దూసుకెళ్తున్నాయి. అక్టోబర్ 6వ తేదీ, ఆదివారం బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 77,670 పలుకగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 71,200 పలికింది. పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా బంగారం ధరలు ప్రతిరోజు రికార్డు స్థాయిని తాకుతున్నాయి బంగారం ధరలో ఈ నెల ప్రారంభం నుంచి కొత్త రికార్డులను సృష్టిస్తూ ముందుకు వెళుతున్నాయి.
అటు వెండి ధరలు లక్ష దాటింది. హైదరాబాద్ లో కేజీ వెండి ధర రూ. 1,03,000 పలుకుతుంది. వెండి ధరలు కోల్ కతాలో 97వేలు, బెంగళూరులో 92వేలు ఉంది. ఇప్పటికే బంగారం ధర ఆల్ టైం రికార్డ్ స్థాయి 78 వేల ఎగువన నమోదయింది. అక్కడి నుంచి గడచిన రెండు రోజులుగా బంగారం ధర స్వల్పంగా తగ్గింది. బంగారం ధరలు పెరగడానికి ప్రధానంగా అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు ప్రధాన కారణంగా నిపుణులు పేర్కొంటున్నారు. అయితే బంగారం ధరలకు ఈ రేంజ్ లో రెక్కలు రావడానికి ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న ప్రపంచ జియో పొలిటికల్ పరిణామాలే కారణమని నిపుణులు పేర్కొంటున్నారు.
ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం కారణంగా ప్రపంచ వాణిజ్యం ప్రభావితమయ్య అవకాశం ఉంటుంది . ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ ఉత్పత్తిలో పశ్చిమాసియా దేశాలు అత్యంత కీలకమైనవి కారణంగా క్రూడ్ ఆయిల్ సరఫరా పై ప్రభావం ఏర్పడే అవకాశం ఉంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగే అవకాశం ఉంటుంది పెట్రోల్ డీజిల్ ధరలు కూడా పెరుగుతాయి. దీంతో భారత్ చైనా వంటి అతిపెద్ద మార్కెట్లలో ఆర్థిక వ్యవస్థ ప్రభావితం అవుతుంది.
Also Read: Fact Check: అన్న ప్రసాదంలో జెర్రీ వార్త పూర్తిగా అవాస్తవం.. ఫేక్ న్యూస్ నమ్మవద్దంటూ టిటిడి విజ్ఞప్తి
ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టాక్ మార్కెట్లలో పతనం నమోదయ్య అవకాశం ఉంది. ఈ కారణంగా ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను స్టాక్ మార్కెట్ నుంచి బంగారం వైపుకు తరలించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బంగారం అత్యంత సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తారు ఇలాంటి సంక్షోభ సమయాల్లో సాధారణంగా ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారం పైనే ఉంచడానికి ఇష్టపడతారు.
గతంలో కరోనా సంక్షోభ సమయంలో కూడా ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఎక్కువగా బంగారం పైనే పెట్టారు. ఇక చైనా లాంటి దేశాలు కూడా రానున్న ఆర్థిక సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకొని పెద్ద ఎత్తున బంగారాన్ని కొనుగోలు చేస్తోంది. దీంతో బంగారం ధర ప్రపంచవ్యాప్తంగా సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఇక మన దేశంలో చూస్తే బంగారం ధర ప్రస్తుతం ఈనెల చివరి నాటికి అంటే ధన త్రయోదశి నాటికి బంగారం ధర 85000 రూపాయలు అందుకునే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
దీనికి తోడు అమెరికా అధ్యక్ష ఎన్నికలు కూడా ఉన్న నేపథ్యంలో ప్రపంచ స్టాక్ మార్కెట్లో ప్రభావితమయ్యే అవకాశం ఉంది దీంతో బంగారం ధరలు ఈ సంవత్సరం చివరి నాటికి ఒక లక్ష రూపాయలు దాటిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని నిపుణులు అంచనా వేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter