Case on Balakrishna daaku maharaaj fans animal sacrifice incident: నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన డాకు మహరాజ్ మూవీ సంక్రాంతి కానుకగా అభిమానుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ మీద మంచి టాక్ ను సొంతం చేసుకుంది. బాలయ్య అభిమానులు మాత్రం ఫుల్ జోష్ గా ఉన్నారు. ఈ మూవీ విడుదలైనప్పుడు థియేటర్ ల దగ్గర అభిమానులు పూనకాలతో ఊగిపోయారు.
బాలయ్య కటౌట్ లకు లిక్కర్ తో అభిషేకం చేశారు. అంతే కాకుండా.. మేకపోతు బలిచ్చి.. దాని రక్తంతో బాలయ్య అభిమానులకు వీరతిలకం దిద్దారు. మొత్తానికి సంక్రాంతి వేళ రిలీజ్ అయి..ఈ మూవీ మంచి టాక్ ను సొంతం చేసుకుంది. హీరో నందమూరి బాలకృష్ణ మూవీస్ లలో అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాల సరసన డాకు మహారాజ్ కూడా చేరిపోయింది. ఈ మూవీ ప్రస్తుతం 114 కోట్లు వసూళ్లు చేసిందని మేకర్స్ ప్రకటించారు.
అయితే.. ఈ మూవీ రిలీజ్ సమయంలో తిరుపతిలోని.. టాటానగర్ లో ఉన్న ప్రతాప్ సినిమా థియేటర్ కొంత మంది అభిమానులు అతిగా ప్రవర్తించారు. ఒక మేకపోతును.. బలిచ్చారు. ఈ వీడియో అప్పట్లో బాగా వైరల్ గా మారింది. మేకపోతును థియేటర్ కు తీసుకొచ్చి..అత్యంత క్రూరంగా దాని మెడను నరికేశారు. ఈవీడియో అప్పట్లో తెగ వైరల్ గా మారింది. దీనిపై జంతు ప్రేమికులు మండిపడ్డారు.
Read more: Viral Video: గరిట తిప్పిన చైతూ.. కమ్మటి చేపల పులుసు ఎలా వండాడో చూసేయండి.. వీడియో వైరల్..
పెటా సంస్థ ఫిర్యాదు మేరకు తిరుపతి పోలీసులు.. ఏపీ జంతువులు, పక్షుల బలులు నిషేధం చట్టం, క్రూరత్వ నిరోధక చట్టం, బీఎన్ఎస్ చట్టాల ప్రకారం పోలీసులు కేసును నమోదు చేశారు. ఈ ఘటనకు కారణమైన.. ఐదుగుర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter