Nikhil Siddarth: కార్తికేయ 2 విషయంలో విలన్ దిల్ రాజు కాదు.. అసలు విషయం బయట పెట్టిన నిఖిల్

Nikhil Siddarth Clarity On Dil Raju Behind Karthikeya 2 Postponement: కార్తికేయ 2 సినిమా అనేక సార్లు వాయిదా పడకపోవాడానికి గల కారణం దిల్ రాజు అని ప్రచారం జరుగుతున్న క్రమంలో నిఖిల్ క్లారిటీ ఇచ్చారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 15, 2022, 08:35 AM IST
Nikhil Siddarth: కార్తికేయ 2 విషయంలో విలన్ దిల్ రాజు కాదు.. అసలు విషయం బయట పెట్టిన నిఖిల్

Nikhil Siddarth Clarity On Dil Raju Behind Karthikeya 2 Postponement: నిఖిల్ సిద్ధార్థ హీరోగా నటించిన కార్తికేయ 2 సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఆగస్టు 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ ముందుకు వెళుతుంది. అయితే ఈ సినిమా నిజానికి ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది కానీ అనేక సార్లు వాయిదా పడుతూ వచ్చింది.

అలా వాయిదా పడుతూ రావడానికి గల కారణం థియేటర్లు దొరకకపోవడమే అని తన లాంటి ఒక హీరోకి కూడా థియేటర్లో దొరకవు అనే విషయం తనకు ఈ సినిమాతోనే తెలిసిందని నిఖిల్ సిద్ధార్థ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. తన సినిమాని ఆగస్టులో కూడా విడుదల చేసుకోవద్దని ఇంకా ఇంకా వెనక్కి వెళ్లాలని సూచించాలని థియేటర్లో దొరకవు అని భయపెట్టారు అని ఆ సమయంలో తాను ఏడ్చానని కూడా ఆయన సదరు ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

అయితే తెలుగు సినీ పరిశ్రమలో థియేటర్లు అన్నీ కూడా నలుగురు వ్యక్తుల చేతుల్లోనే ఉన్నాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అందులో ప్రముఖంగా వినిపించే దిల్ రాజు పేరు కూడా ఈ విషయంలో వినిపించింది. ఆయన వల్లే ధియేటర్లు దొరకలేదని ప్రచారం జరిగింది. దానికి తోడు 22వ తేదీ జూలై నెలలో కార్తికేయ 2 సినిమా మొదటిసారి విడుదల కావాల్సిన సమయంలో థాంక్యూ సినిమా రిలీజ్ కావాడంతోనే ఆయన బలవంతం పెట్టడంతోనే నిఖిల్ సిద్ధార్థ సినిమా వెనక్కి వెళ్లిందని ప్రచారం జోరుగా జరిగింది.

అయితే అదే ఇంటర్వ్యూలోనే నిఖిల్ దిల్ రాజు, ఏషియన్ సునీల్ తన సినిమాని ఈజీగా విడుదలయ్యేలా చేస్తున్నారని వాళ్ళకి ధన్యవాదాలు చెప్పినా సరే ఎందుకో దిల్ రాజు నిఖిల్ ఎపిసోడ్లో విలన్ అనే విధంగా సోషల్ మీడియాలో ప్రొజెక్ట్ అయింది. ఈ విషయం మీద తాజాగా నిఖిల్ సిద్ధార్థ స్పందించాడు. ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా ఈ విషయంలో దిల్ రాజు గారి ప్రమేయం అసలు ఏమీ లేదని ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఈ విషయంలో నిర్ణయాలు తీసుకుందని ఆయన చెప్పకువచ్చారు. దిల్ రాజు ఒక్కరే సినిమా వాయిదా వేసుకోమని కోరలేదని సుమారు 20 నుంచి 30 మంది నిర్మాతలు కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పుకొచ్చారు.

అసలే ప్రజలు థియేటర్లకు రావడం లేదు ఇలాంటి సమయంలో పోటాపోటీగా రెండు మూడు సినిమాలు విడుదల చేస్తే జనాలు కన్ఫ్యూజన్లో పడితే కనుక ఏ సినిమాకు కూడా పూర్తిస్థాయి వసూళ్లు రావని వారు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని నిఖిల్ సిద్ధార్థ చెప్పుకొచ్చారు. అయితే సంవత్సరానికి 52 వారాలు ఉంటాయి కాబట్టి 52 సినిమాలే విడుదల చేయాలి అనుకోవడం కూడా సరైనది కాదనేది తన అభిప్రాయం అని నిఖిల్ చెప్పుకొచ్చారు. సినిమాల్లో పోటీ ఉండాలని అలా ఉంటేనే ప్రేక్షకులు కూడా ఆసక్తికరంగా థియేటర్లకు వస్తారని నిఖిల్ సిద్ధార్థ అభిప్రాయపడ్డాడు. ఇక చాలా కాలంగా దిల్ రాజు విషయం మీద జరుగుతున్న ప్రచారం నిజం కాదని ఇలా నిఖిల్ సిద్ధార్థ క్లారిటీ ఇవ్వడం గమనార్హం.
Also Read: Zee Saregamapa: శృతిక సముద్రాల చేతికి ‘జీ సరిగమప ది సింగింగ్ సూపర్ స్టార్’ టైటిల్.. కళ్లు చెదిరే బహుమతులు కూడా!

Also Read: Bandla Ganesh: కార్లు పైకిలేస్తే థియేటర్లకు జనాలు వస్తారా.. ఇలా చేస్తేనే మనుగడ అంటూ బండ్ల స్ట్రాంగ్​ కౌంటర్​

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News