Prakash Raj Tweet on Maa Elections Controversy: రసవత్తరంగా సాగిన మా ఎన్నికలలో మంచు విష్ణు (Manchu Vishnu) గెలిచిన సంగతి మనకు తెలిసిందే.. అదే విధంగా మా సభ్యత్వనికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకాష్ రాజ్ ప్యానల్ (Praksh Raj Panel) సభ్యులు ప్రకటించిన సంగతి కూడా తెలిసిందే. ప్రకాష్ రాజ్ ప్యానల్ రాజీనామా లేఖలు అందలేదని మంచు విష్ణు కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే!
అయితే మా ఎన్నికల రగడ ముగిసింది అని అందరు అనుకునే సమయంలో.. ప్రకాష్ రాజ్ (Prakash Raj) చేసిన సంచలన ట్వీట్ తో 'మా' ఎన్నికల (MAA Elections) వివాదం మరో కీలక మలుపు తీసుకుంది. ఏపీ రౌడీ షీటర్లు మా ఎన్నికలు జరిగే సమయంలో ఓటర్లను బెదిరించారు, కృష్ణా జిల్లా జగ్గయ్య పేట రౌడీ షీటర్ నూకల సాంబశివరావు (Nukla SambashivaRao) ఓట్ల లెక్కించే సమయంలో అక్కడే ఉన్నారని ఆయన పేర్కొన్నారు.
Also Read: Paritala Sunitha: మాది సీమ రక్తమే..రక్తం ఉడుకుతోంది: పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు
అంతేకాకుండా ఆ రౌడీ షీటర్ పై చాలా కేసులు ఉన్నాయని, ఎస్ఐలను కొట్టాడు మరియు అతడిపై మర్డర్ కేసు కుడా ఉందని ప్రకాష్ రాజ్ ఆరోపించారు.
ఎన్నికల అధికారి కృష్ణ మోహన్ (Elections Officet Krishna Mohan) గారికి ఈ విషయంపై ఫిర్యాదు చేసిన ఎలాంటి ఫలితం దక్కలేదని ప్రకాష్ రాజ్ తెలిపారు. అంతేకాకూండా, వీటికి సంబంచిందిన కొన్ని ఫోటోలను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు ప్రకాష్ రాజ్.
#MaaElections2021 .. dear Election officer Krishna mohan garu .. this is just the beginning.. give us the CC footage.. we will let the world know what happened.. how the elections were conducted #justasking pic.twitter.com/ew8waPyAXN
— Prakash Raj (@prakashraaj) October 22, 2021
Also Read: Prabhas New Look: రాధేశ్యామ్ నుండి ప్రభాస్ న్యూ లుక్.. లీకైన రాధేశ్యామ్ టీజర్ పిక్స్..??
"#మా ఎలక్షన్స్ 2021.. గౌరవనీయులైన ఎలక్షన్స్ ఆఫిసర్ కృష్ణమోహన్ గారు.. ఇది కేవలం ఆరంభం మాత్రమే.. మాకు సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వండి.. ఎన్నికలు ఎలా జరిగాయో.. ?? ఎన్నికల రోజు ఏం జరిగిందో..?? ప్రపంచానికి తెలియజేస్తాము.. #జస్ట్ ఆస్కింగ్.." అంటూ ప్రకాష్ రాజ్ కొన్ని ఫోటోలను షేర్ చేశారు.
ఆ ఫోటోలో నూకల సాంబశివరావు మోహన్ బాబు (Mohan Babu) గారితో మరియు వారి కుటంబ సభ్యులతో చనువుగా ఉన్నట్లు తెలుస్తుంది మరియు అదే వ్యక్తి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) గారితో దిగిన ఫోటో కూడా ఉంది. ప్రకాష్ రాజ్ చేసిన సంచలన ట్వీట్ తో 'మా' ఎన్నికల్లోకి ఏపీ రాజకీయాలు జోక్యం చేసుకున్నాయా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయంపై 'మా' అధ్యక్షుడు మంచు విష్ణు (Maa President Manchu Vishnu) మరియు ఆంధ్రప్రదేశ్ వైసీపీ నేతలు (YCP Leaders) ఎలా స్పందిస్తారో వేచి చూడాలి..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook