Padma Bhushan Balakrishna: పద్మభూషణ్ వచ్చిన సందర్భంగా బాలకృష్ణ ను సత్కరించిన టాలీవుడ్ సినీ ప్రముఖులు..

Padma Bhushan Balakrishna: తాజాగా రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం హీరో నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ పురస్కారంతో గౌరవించింది. ఈ నేపథ్యంలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు బాలయ్యను ప్రత్యేకంగా అభినందించిన సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు బాలయ్యను ప్రత్యేకంగా కలిసి విషెస్ తెలియజేసారు. తాజాగా తెలుగు చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు బాలయ్యను సత్కరించారు.  

Written by - TA Kiran Kumar | Last Updated : Feb 7, 2025, 09:27 PM IST
Padma Bhushan Balakrishna: పద్మభూషణ్ వచ్చిన సందర్భంగా  బాలకృష్ణ ను సత్కరించిన టాలీవుడ్ సినీ ప్రముఖులు..

Padma Bhushan Balakrsihna: తెలుగు చలనచిత్ర పరిశ్రమకు విశేష సేవలు అందించిన అగ్ర హీరో హిందూపురం  తెలుగు దేశం ఎమ్మెల్యే, బసవతారకం కాన్సర్ హాస్పిటల్ చైర్మన్  నందమూరి బాలకృష్ణకి భారత ప్రభుత్వం పద్మ భూషణ్ పురస్కారంతో గౌరవించింది.  ఈ సందర్భంగా, తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖులు నందమూరి బాలకృష్ణ ఇంటికి వెళ్లి ఆయనకు అభినందనలు తెలియజేసారు. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ పి భరత్ భూషణ్, సెక్రటరీ కె ఎల్ దామోదర్ ప్రసాద్, కోశాధికారి తుమ్మల  ప్రసన్న కుమార్ సహా  తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ కె ఎల్ దామోదర్ ప్రసాద్, సెక్రటరీ తుమ్మల   ప్రసన్న కుమార్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ మాదాల రవి బాలయ్యను కలిసి అభినందనలు తెలియజేసారు. కోశాధికారి వి సురేష్, తెలుగు సినీ రైటర్స్ అసోసియేషన్ సెక్రెటరీ ఉమర్జీ అనురాధ , తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ యూనియన్ ప్రెసిడెంట్ కె అమ్మిరాజు, చిత్రపురి హిల్స్ ప్రెసిడెంట్ & తెలుగు సినీ,టీవీ జూనియర్ ఆర్టిస్ట్స్ యూనియన్ సెక్రటరీ వల్లభనేని అనిల్ కుమార్ తో పాటు  అటు తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ సెక్రటరీ కె అనుపమ్ రెడ్డి, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ వల్లభనేని అనిల్ కుమార్,సెక్రటరీ కె అమ్మిరాజు, తెలుగు సినీ,టీవీ అవుట్ డోర్ యూనిట్ టెక్నిషన్స్ యూనియన్ సెక్రటరీ వి సురేష్, తెలుగు సినీ స్టంట్ డైరెక్టర్స్ & స్టంట్ ఆర్టిస్ట్స్ యూనియన్ కోశాధికారి రమేష్ రాజా సహా  మొత్తం ఇండస్ట్రీ నుండి 10 అసోసియేషన్స్ అండ్ యూనియన్స్ కలిసి నందమూరి బాలకృష్ణ  కలసి ఆయనకు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించి  శుభాకాంక్షలు తెలియజేసారు. వారు అంతా కలిసి త్వరలో నందమూరి బాలకృష్ణ ని సన్మానించేందుకు తెలుగు చిత్ర పరిశ్రమ ఘనంగా ఏర్పాట్లు చేస్తునట్టు తెలియజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... “నందమూరి బాలకృష్ణ యాక్టర్ గానే కాదు.. సినీ పరిశ్రమకు, సేవా కార్యక్రమాలకు చేసిన సేవలకు గుర్తింపుగా కేంద్రం ఈ  అవార్డుతో గౌరవించడం ఎంతో గర్వించదగ్గ విషయం అన్నారు.  

ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..

పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ... “ఈ అవార్డు నాకు, మా కుటుంబానికే కాదు, తెలుగు సినీ పరిశ్రమకు వచ్చిన గౌరవం అన్నారు. ఈ అవార్డు నాకు మరింత బాధ్యతను పెంచిందన్నారు. బాలయ్య సినిమాల విషయానికొస్తే.. సంక్రాంతి కానుకగా ‘డాకు మహారాజ్’ సినిమాతో మరో సక్సెస్ ను అందుకున్నారు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ 2 తాండవం’ సినిమా చేస్తున్నారు. ఆ సినిమా తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరో సినిమాకు ఓకే చెప్పినట్టు సమాచారం. అటు ఆదిత్య 999 మాక్స్ మూవీని తన దర్శకత్వంలో చేయడానికి రెడీ అవుతున్నారు.

ఇదీ చదవండి:   గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!

ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News