Vishwak Sen Laila Teaser Out Now: సినీ పరిశ్రమలో కష్టపడి పైకొచ్చి తొలి సినిమాతోనే తానేంటో నిరూపించుకున్న మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కెరీర్ తొలి నాళ్లలో విజయాలు పొందాడు. భారీ హిట్ కోసం ఎదురుచూస్తున్న విశ్వక్ సేన్ తాజాగా 'లైలా' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. రొటీన్ సినిమాలకు భిన్నంగా కొత్త ప్రయత్నం చేస్తూ విశ్వక్ 'లైలా' కథను ఎంచుకున్నాడు. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదలవగా.. ప్రేక్షకులను ఆకర్షిస్తోంది. మరి లైలా టీజర్ ఎలా ఉంది? ఈ సినిమాతో విశ్వక్ హిట్ కొట్టనున్నాడా? అనేది చూద్దాం.
Also Read: Sreemukhi: మరో వివాదంలో శ్రీముఖి.. ఇంద్రకీలాద్రిపై రీల్స్, ఫొటోషూట్‌తో హల్‌చల్
రామ్ నారాయణ్ దర్శకత్వంలో సాహూ గారపాటి నిర్మాణంలో 'లైలా' సినిమా రూపుదిద్దుకుంటోంది. ఆకాంక్ష శర్మతో జతకట్టిన విశ్వక్ సేన్ మేకప్ ఆర్టిస్ట్ సోను పాత్రలో మెరిశాడు. పాతబస్తీలో మేకప్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు పొందిన సోను వలన కొందరు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయమై ఒకరికి ఫిర్యాదు చేసినట్టు.. ఆ తర్వాత మేకప్ ఆర్టిస్ట్‌గా ఎదుర్కొన్న ఇబ్బందుల విషయమై మిగతా కథ ఉండేలా కనిపిస్తోంది. మొత్తం 1.43 నిమిషాల టీజర్ ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తుతోంది. హాస్యభరితంగా ఈ కథను రామ్ నారాయణ్ తెరకెక్కిస్తున్నాడు.
Also Read: Daaku Maharaaj Movie: డాకు మహారాజ్‌కు థియేటర్‌లో ఎదురుదెబ్బ.. థమన్‌పై ఫ్యాన్స్ ఫైర్
చిన్న టీజర్‌లోనే కొన్ని డైలాగ్‌లు ఆకట్టుకున్నాయి. 'తెల్లగా సేసుడే కాదు.. తోలు తీసుడు వచ్చు', 'ఒక్కొక్కరికి చిలకలు కోసి చీరలు కట్టి పంపిస్తా' వంటి డైలాగ్‌లు ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. టీజర్ చివరలో విశ్వక్ సేన్ గుర్తుపట్టలేని పాత్రలో కనిపించాడు. అమ్మాయిలు సైత ఈర్ష్య పడేలా విశ్వక్ లేడీ గెటప్‌లో కనిపించాడు. ఈ సన్నివేశం సినిమాలో కీలక ఎపిసోడ్‌గా ఉంటుందని తెలుస్తోంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌లో రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉంది. ఫిబ్రవరి 14వ తేదీన ప్రేమికుల దినోత్సవం రోజు థియేటర్‌లలో విశ్వక్ సేన్ సందడి చేయనున్నాడు. లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తుండగా.. డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ రిచర్డ్ ప్రసాద్, పీఆర్‌వోలుగా వంశీ శేఖర్ ఉన్నారు.
ఈ టీజర్‌తో విశ్వక్ సేన్ 'లైలా' సినిమాపై అంచనాలు పెంచేశాడు. తనకు సహజసిద్ధమైన సోను పాత్రలో విశ్వక్ మెరిశాడు. గతంలో విశ్వక్ చేసిన హిట్ ఫార్ములా కథగా ఇది ఉంది. కొద్దిగా బొద్దుగా కనిపించిన విశ్వక్ నటనలో మెరుగయ్యాడని కనిపిస్తోంది. హైదరాబాద్ పాతబస్తీ బ్యాక్‌గ్రౌండ్ నేపథ్యంలో ఈ కథ నడిచేటట్టు ఉంది. ఈ సినిమాతో విశ్వక్ తన కెరీర్‌లో భారీ హిట్ పొందనున్నట్లు సినీ వర్గాలు భావిస్తున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter