Vishwak Sen-Jr NTR: ప్రతి హీరోకి తన అభిమాన హీరో సినిమా తను చేస్తే ఎలా ఉంటుంది అని అనిపిస్తూ ఉంటుంది. కొందరైతే తమ ఫేవరెట్ హీరో సినిమాని రీమేక్ చేయాలని కూడా అనుకుంటూ ఉంటారు. మామూలు సినిమా రీమేక్ చేసినా పెద్దగా క్రేజ్ రాదు. బ్లాక్ బస్టర్ సినిమా రీమేక్ చేయాలంటే రిస్క్ ఎక్కువ. ఇక క్లాసిక్ సినిమాల జోలికి వెళ్లకుండా ఉంటేనే మంచిది అని చాలా వరకు హీరోలు రీమేక్ ల జోలికి వెళ్ళరు.
అయితే తాజాగా విశ్వక్ సేన్ మాత్రం ఎన్టీఆర్ హీరోగా నటించిన ఒక సినిమాని రీమేక్ చేయాలని అనుకుంటున్నట్టు చెప్పారు. ఇప్పట్లో చేసే ప్లాన్ లేకపోయి ఉండొచ్చు కానీ ప్రస్తుతం గాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నా విశ్వక్ సేన్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు.
ఈ నేపథ్యంలోనే ఒక ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ సినిమాలలో ఒకదాన్ని రీమేక్ చేయాల్సి వస్తే ఏ సినిమాని చేస్తారు అని ప్రశ్న విశ్వక్ సేన్ కి ఎదురైంది. దానికి ఏమాత్రం ఆలోచించకుండా ఈ యువహీరో వెంటనే నా అల్లుడు సినిమా రీమేక్ చేస్తాను అని చెప్పేసారు.
ఏదైనా సూపర్ హిట్ సినిమాని రీమేక్ చేయాలి అనుకోవడంలో తప్పులేదు కానీ నా అల్లుడు సినిమా ఎప్పుడో 2005లో విడుదలైంది. అప్పట్లో ఎన్టీఆర్ కేవలం మాస్ సినిమాలు మాత్రమే చేసేవారు. అలాంటి మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ తోనే నా అల్లుడు సినిమా కూడా విడుదలైంది. రమ్యకృష్ణ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాలో శ్రియ శరన్, జెనీలియాలో హీరోయిన్లుగా నటించారు.
అయితే అప్పట్లో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. అలాంటిది ఎప్పుడు 20 ఏళ్ల క్రితం రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయినా సినిమాని రీమేక్ చేయడం ఏంటి అని కొందరు షాక్ అవుతున్నారు. అయితే నా అల్లుడు సినిమాలో కొన్ని మార్పులు చేసి ఉంటే అప్పట్లో శ్రమ కచ్చితంగా హిట్ అయ్యి అవకాశాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు సినిమాలలో కొత్తదనం కోసం చూస్తున్న ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చే అవకాశాలు తక్కువే. అయితే అలాంటి కథతో కూడా ఇప్పుడు ఎక్స్పరిమెంట్ సినిమా చేయొచ్చు అని విశ్వక్ సేన్ ఆలోచన అయి ఉండొచ్చు. మరి నిజంగా విశ్వక్ సేన్ నా అల్లుడు సినిమా రీమేక్ చేస్తే ఎలా ఉంటుందో చూడాలి.
ఇదీ చదవండి: దేశవ్యాప్తంగా ఆరో విడత ఎన్నికల ప్రచారం పూర్తి.. 58 స్థానాలకు రేపే పోలింగ్..
ఇదీ చదవండి: శ్రీధర్ రెడ్డి హత్యపై కేటీఆర్ ఫైర్.. ఇలాంటివి మళ్లీ జరిగితే రేవంత్ రెడ్డి తట్టుకోలేవు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter