RAM Rapid Action Mission: 'రామ్‌'ర్యాపిడ్ యాక్షన్‌ మూవీ నుంచి 'బ్రేవ్ హార్ట్స్' పాట విడుదల

Brave Hearts Song: దీపిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై మిహిరామ్ వైనతేయ దర్శకత్వంలో  రూపొందుతున్న మూవీ 'రామ్‌'ర్యాపిడ్ యాక్షన్‌. ఈ మూవీ నుంచి బ్రేవ్ హార్ట్స్ అంటూ సాగే ఓ దేశ భక్తి గీతాన్ని మేకర్స్ రిలీజ్ చేశారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 22, 2023, 03:30 PM IST
 RAM Rapid Action Mission: 'రామ్‌'ర్యాపిడ్ యాక్షన్‌ మూవీ నుంచి 'బ్రేవ్ హార్ట్స్' పాట విడుదల

Brave Hearts Song: రియల్ లైఫ్‌ స్టోరీలకు రీల్‌ లైఫ్‌లో ఎప్పుడు క్రేజ్ ఉంటుంది. వెండితెరపై చక్కగా ఆవిష్కరిస్తే.. ఓ సెక్షన్ ఆఫ్ ఆడియెన్స్ ఎప్పుడూ ఆసక్తి చూపుతుంటారు. ఇటీవల దర్శకనిర్మాతలతో పాటు ఆడియన్స్‌ కూడా ఇలాంటి స్టోరీలపై ఇంట్రెస్ట్ కనబరుస్తున్నారు. నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేందకు రామ్‌  (RAM/ర్యాపిడ్ యాక్షన్ మిషన్) అనే మూవీ తెరకెక్కుతోంది. దీపిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఓఎస్‌ఎం విజన్‌తో కలిసి ప్రొడక్షన్‌ నెం.1గా ఈ మూవీని రూపొందిస్తున్నారు. దీపికాంజలి వడ్లమాని నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

దేశభక్తి బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతుండగా.. ఇప్పటికే రిలీజ్ చేసిన  చేసిన ఫస్ట్ లుక్, గ్లింప్స్‌ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ మూవీ నుంచి బ్రేవ్ హార్ట్స్ అంటూ సాగే ఓ దేశ భక్తి గీతాన్ని మేకర్స్ విడుదల చేశారు. ఈ సాంగ్‌కు రాహుల్ సిప్లిగంజ్ గాత్రం అందించగా.. రాము కుమార్ ఏఎస్కే సాహిత్యాన్ని అందించారు. ఆశ్రిత్ అయ్యంగార్ బాణీ ప్రతీ ఒక్కరిలో దేశభక్తిని తట్టిలేపేలా ఉంది. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News