కత్రినా కైఫ్ డ్యాన్స్ చూడాలంటే, గుండెలు చేతపట్టుకోవాల్సిందేనట!

సురయ్య తెలుగు సాంగ్ టీజర్ విడుదల 

Last Updated : Oct 25, 2018, 12:49 AM IST
కత్రినా కైఫ్ డ్యాన్స్ చూడాలంటే, గుండెలు చేతపట్టుకోవాల్సిందేనట!

తాను స్టెప్పేస్తే చూసి ప్రాణాలోదిలేసిన వాళ్లు కూడా ఉన్నారు.. అందుకే ముందే కాస్త గుండెలు చేతపట్టుకోండి అంటోంది కత్రినా కైఫ్. అమీర్ ఖాన్, అమితాబ్ బచ్చన్, కత్రినా కైఫ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన థగ్స్ ఆఫ్ హిందుస్తాన్ మూవీ దీపావళి కానుకగా ఈ నవంబర్ 8న విడుదల కానున్న సంగతి తెలిసిందే. సినిమా విడుదల తేదీ సమీపిస్తున్న సందర్భంగా తాజాగా ఈ సినిమాలోంచి సురయ్య అనే సాంగ్ టీజర్‌ని విడుదల చేశారు. మ్యూజిక్ కంపోజర్స్ ద్వయం అజయ్-అతుల్ మ్యూజిక్ కంపోజ్ చేయగా.. నకాష్ అజీజ్, శ్రేయా ఘోషాల్ ఈ పాట పాడారు. ఈ పాటకు కత్రినా కైఫ్ వేసిన స్టెప్పులు, బాడీ లాంగ్వెజ్ చూస్తే, ఆమె మాటలు నిజమేనేమోననేలానే ఉంది. విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను యాశ్ రాజ్ ఫిలింస్ నిర్మించింది. హిందీలో ప్రముఖ గేయ రచయిత అమితాబ్ భట్టాచార్య రచించిన ఈ పాటను చైతన్య ప్రసాద్ తెలుగులోకి అనువదించారు. 

Trending News