Cholesterol Night Signs: రాత్రి వేళ ఈ 5 లక్షణాలు కన్పిస్తే కొలెస్ట్రాల్ తీవ్రంగా ఉన్నట్టే

Cholesterol Night Signs: ఆధునిక జీవన విధానంలో వివిధ రకాల వ్యాధులు ఉత్పన్నమౌతుంటాయి. చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి ఇందుకు కారణం. ఎందుకంటే చెడు ఆహారపు అలవాట్లు శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 29, 2025, 10:01 PM IST
Cholesterol Night Signs: రాత్రి వేళ ఈ 5 లక్షణాలు కన్పిస్తే కొలెస్ట్రాల్ తీవ్రంగా ఉన్నట్టే

Cholesterol Night Signs: ఒక్క చెడు కొలెస్ట్రాల్ శరీరంలో వివిధ రకాల అనారోగ్య సమస్యలకు కారణమౌతుంది. కొలెస్ట్రాల్‌ను సకాలంలో గుర్తించలేకపోతే గుండె వ్యాధులు, స్ట్రోక్ వంటి సమస్య ఉత్పన్నమౌతుంది. శరీరంలో కొలెస్ట్రాల్ సమస్య పెరిగితే కొన్ని లక్షణాల ద్వారా గుర్తించవచ్చు. ముఖ్యంగా రాత్రి వేళ కన్పించే ఈ 5 లక్షణాలను ఏ పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదు

ఇటీవలి జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా చెడు కొలెస్ట్రాల్ శరీరంలో పేరుకుపోతుంటుంది. కొలెస్ట్రాల్ పరిమితంగా ఉంటే ఏ సమస్య లేదు. కానీ పెద్దమొత్తంలో కొలెస్ట్రాల్ ఉంటే మాత్రం తీవ్రమైన సమస్యలు ఎదురుకావచ్చు. శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువైతే సాధారణంగా పగటి పూటే లక్షణాలే తెలుస్తుంటాయి. రాత్రి వేళ కన్పించే కొన్ని లక్షణాలను చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు. అయితే ఇవే ప్రమాదకరం కావచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 

చెడు కొలెస్ట్రాల్ కారణంగా గుండె ధమనులు సంకోచిస్తాయి. దాంతో రక్త ప్రసరణలో ఇబ్బంది కలుగుతుంది. రాత్రి సమయంలో ధమనులు సంకోచించడం వల్ల ఛాతీలో నొప్పి లేదా మంట ఉత్పన్నం కావచ్చు. అంతేకాకుండా రాత్రి సమయంలో అలసటగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ ప్రధాన లక్షణం. చెడు కొలెస్ట్రాల్ కారణంగా రక్త ప్రసరణ తగ్గిపోతుంది. ఫలితంగా శరీరంలో కావల్సినంత ఎనర్జీ లభించదు. 

చెడు కొలెస్ట్రాల్ కారణంగా శరీరంలో రక్త ప్రసరణపై ప్రతికూల ప్రభావం పడుతుంది. దాంతో కాళ్లు, మడమ, మోకాళ్లలో స్వెల్లింగ్ రావచ్చు. రాత్రి వేళ స్వెల్లింగ్ సమస్య మరింతగా పెరుగుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే రక్త ప్రసరణ మందగిస్తుంది. దాంతో రాత్రి వేళ సరిగ్గా నిద్ర పట్టదు. నిద్రలేమి సమస్య కూడా ఎదురౌతుంది. 

చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల శరీరంలో రక్త ప్రసరణకు అంతరాయం ఏర్పడుతుంది. దాంతో బాడీలో వివిధ అవయవాలకు కావల్సినంత ఆక్సిజన్ లభించదు. రాత్రి పడుకొనేటప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురౌతుంది. ఈ లక్షణాలు ఎదురైతే వెంటనే వైద్యుని సంప్రదించాలి. దాంతోపాటే ఎప్పటికప్పుడు హెల్తీ డైట్, తగినంత వ్యాయామం చేయాల్సి ఉంటుంది. 

Also read: 8th Pay Commission Salary Hike: 8వ వేతన సంఘంపై మేజర్ అప్‌డేట్, ఉద్యోగుల జీతం ఎంత పెరుగుతుందో ఊహించగలరా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News