ఈ ఆహారాలు తింటే రక్త నాళాలను ఆరోగ్యాంగా ఉంటాయి.. హార్ట్ అటాక్ రాదు!

ఇటీవల కాలంలో గుండె పోటుకు గురయ్యే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలో ధమనులు, సిరలు ఆరోగ్యంగా ఉండాలి. రక్త నాళాలు ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తినండి!

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 31, 2023, 10:40 PM IST
ఈ ఆహారాలు తింటే రక్త నాళాలను ఆరోగ్యాంగా ఉంటాయి.. హార్ట్ అటాక్ రాదు!

మనం ఆరోగ్యంగా ఉండాలంటే.. శరీరంలోని అంతర్గత అవయవాలు ఆరోగ్యంగా ఉండాలి. ముఖ్యంగా రక్తనాళాలు.. ఇవి  ఆరోగ్యంగా లేకపోతే గుండె పోటుకు ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. మన శరీరం అనేక సిరుల, ధమనుల కలయిక.. రక్తనాళాలు గుండె నుండి శరీరభాగాలకు రక్తాన్ని సరఫరా చేస్తాయి. కావున శరీరంలోని ఇతర భాగాలతో పాటు రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచడం చాలా అవసరం. ఆరోగ్య నిపుణుల తెలిపిన దాని ప్రకారం..  సిరలు సరళంగా ఉంటాయి..  వీటి నుండి రక్త ప్రసరణ సులభంగా జరుగుతుంది. రక్తనాళాలు ఆరోగ్యంగా ఉండడానికి కొన్ని ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పాటించక తప్పదు. 

నాడులు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోకపోతే..  అవి బలహీనంగా అనారోగ్యంగా మారతాయి. దాని వల్ల సిరలు గట్టిపడతాయి. ఇవి గట్టిపడడం వల్ల గుండె పోటు వచ్చే అవకాశం ఉంటుంది. నిపుణుల ప్రకారం రక్తనాళాలు ఆరోగ్యంగా ఉండడానికి శారీరకంగా బలంగా ఉండడమే కాదు.. ఆరోగ్యకరమైన డైట్ ని పాటించాలి.  

పీచు పదార్ధాలు  
పీచు పదార్ధాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోడం వలన కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది. ధమనుల అనారోగ్యానికి కొలెస్ట్రాల్ ఒక ముఖ్య కారణం. రిఫైన్డ్ ఆహరం ధాన్యాలు, ఉప్పు, చిప్స్ లాంటివి కాకుండా పండ్లు, కూరగాయలను తినాలి.  

ఆకుపచ్చ ఆకుకూరలు.. 
ఆకుపచ్చ కూరలని తీసుకోడం రక్తనాళాలకు చాలా మంచిది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రోజు వారీ ఆహరం లో పండ్లు, కూరగాయలు తీసుకోడం వలన రక్తనాళాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఆకుకూరల్లో బయోఫ్లావనాయిడ్స్, ఫైటోన్యూట్రియెంట్లు ఉంటాయి. ఇవి రక్త ప్రసారాన్ని మెరుగుపరుస్తాయి. వీటితో పాటు ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్స్ కూడా ఉంటాయి ఇవి రక్తనాళాలని బలపరుస్తాయి.  

Also Read: Rushikonda Works: రుషికొండ నిర్మాణాలపై సర్వేకు ఏపీ హైకోర్టు ఆదేశాలు

ఎండు మిర్చి & పసుపు  
నరాలను బలపర్చడానికి మసాలాలు కూడా సహాయపడతాయి. పసుపు లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి ధమనులు గట్టిపడకుంగా కాపాడతాయి. ఎండు మిర్చి రక్త ప్రసరణని ఉత్తేజపరుస్తుంది మరియు ఆరోగ్యమైన రక్త ప్రసరణ నిర్వహణ లో ఉపయోగపడుతుంది.  

ఉప్పు మోతాదుని తగ్గించడం  
రక్తనాళాల్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఉప్పు మోతాదుని తగ్గించుకోవాలి. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. నరాలను ఆరోగ్యంగా ఉంచడానికి తినే ఆహారంలో ఉప్పుని తగ్గించుకోవాలి. ప్రొసెస్డ్ ,ప్యాక్ చేసిన భోజనాన్ని తగ్గించుకోవాలి. ఎందుకంటే అందులో ఉప్పు ఎక్కువగా ఉంటుంది. ప్యాకెడ్ మరియు క్యాన్డ్ ఆహారాన్ని తీసుకునే ముందు వాటిలో ఉప్పు మోతాదుని పరిశీలించడంలో శ్రద్ధ వహించాలి.  

నీళ్లు  
ఆరోగ్యంగా ఉండడానికి నీళ్లు చాలా అవసరం. శరీరంలో దాదాపు 93% నీళ్లు ఉంటాయి. నరాలని ఆరోగ్యంగా ఉంచడానికి రోజులో 8 గ్లాసుల నీళ్ళని తాగాలి. దీని వల్ల శరీరం ఎక్కువగా పని చేసే అవసరం ఉండదు.

Also Read: Motorola Amphisoundx 120W Price: ప్రత్యేక దీపావళి ఆఫర్ మీకోసం..MOTOROLA AmphisoundX సౌండ్ బార్ 40% తగ్గింపు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..

 

Trending News