Nutmeg Milk Health Benefits: సాధారణంగా మనం ఇంట్లో ఉపయోగించే మసాలా దినుసులు మన ఆహారాని రుచికరంగా తయారు చేయడంలో ఎంతో ఉపయోగపడుతాయి. అయితే ఈ దినుసులు కేవలం వంట రుచి కోసమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలకు కూడా ఎంతో ఉపయోగపడతాయని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు. వంట దినుసుల్లో జాజికాయ ఒకటి. దీనిని బిరీయ్యానీ వంటలు, కొన్ని మసాల వంటకల్లో రుచి కోసం ఉపయోగిస్తాము. అయితే ఈ జాజికాయ పొడితో ప్రతిరోజు రాత్రిపూట పాలలో కలుపుకొని తీసుకోవడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని వైద్యులు చెబుతున్నారు. ఈ జాజికాయ పాలను జైపాల్ పాలు అని కూడా అంటారు. జైపాల్ ను తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు లభిస్తాయి. అయితే ఎలాంటి లాభాలు కలుగుతాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ జాజికాయ పాలను తీసుకోవడం వల్ల మనసు విశ్రాంతిని పొందుతుంది. ఈ పాలను రాత్రిపూట తీసుకోవడం వల్ల సుఖమైన నిద్రకలుగుతుంది. అలాగే ప్రస్తుత కాలంలో చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్యలల్లో ఒత్తిడి, ఆందోళన ఒకటి. ఈ సమస్యలతో బాధపడుతున్నవారు రాత్రిపూట ఈ పాలని తీసుకోవడం వల్ల ఉపశమనం పొందవచ్చు. అహారం జీర్ణం కాకపోవడం వల్ల మలబద్ధకం, గ్యాస్, పొట్ట సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీనికి కూడా జాజికాయ పాటు సహాయపడుతాయి. ఇందులో ఉండే పోషకాలు ఈ సమస్యలకు చెక్ పెడుతాయి. అయితే కొంతమంది జ్ఞాపక శక్తి తక్కువ ఉంటుంది, మతిమరుపుతో బాధపడేవారికి కూడా జాజికాయలు తీసుకోవడం వల్ల మెదుడు పనితీరు చురుకుగా ఉంటుంది. అంతేకాకుండా జాజి పాలు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దీని కారణంగా ఆరోగ్య సమస్యలు, ఇన్ఫెక్షన్ ల నుంచి బయటపడవచ్చు.
జాజికాయలో ఆంటీ ఇన్ఫర్మేషన్ వాళ్ళు పుష్కలంగా ఉంటాయి. ఈ జాజి పాలు తీసుకోవడం వల్ల శరీరంలో మంట, వాపు కూడా తగ్గుతాయి. జాజికాయ అధిక రక్తపోటు సమస్యను నియంతించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా చెడు కొలెస్ట్రాల్ లెవల్స్ తొలగించడంలో కూడా మెరుగుగా పనిచేస్తుంది. గుండె సంబంధిత సమస్యలను కూడా నివారించడంలో సహాయపడుతుంది. ఈ జాజికాయకి పాలు తీసుకోనే మందు వైద్యుల సలహ తీసుకోవడం చాలా మంచిది.
జాజికాయ పాలు తయారీ విధానం:
కావలసినవి:
* 1 కప్పు పాలు
* చిటికెడు జాజికాయ పొడి
* 1 టేబుల్ స్పూన్ తేనె
తయారీ విధానం:
ముందుగా ఒక గిన్నెలో పాలు పోసి, మీడియం వేడి మీద మరిగించండి. పాలు మరిగిన తర్వాత, వేడిని తగ్గించి, జాజికాయ పొడి వేసి బాగా కలపాలి. 2-3 నిమిషాలు పాటు ఉడికించాలి. స్టవ్ ఆఫ్ చేసి, తేనెను కలపాలి. వెచ్చగా లేదా చల్లగా వడ్డించండి.
చిట్కాలు:
మీరు మరింత రుచి కోసం, 1/4 టీస్పూన్ యాలకుల పొడి లేదా 1/2 టీస్పూన్ ఏలకుల పొడి కూడా కలుపుకోవచ్చు. జాజికాయ పాలు చాలా గాటుగా ఉండాలనుకుంటే, మీరు మరింత జాజికాయ పొడి వేయవచ్చు. మరింత ఆరోగ్యకరంగా చేయడానికి, మీరు పాలు బదులుగా బాదం పాలు లేదా ఓట్స్ పాలు వాడవచ్చు.
గమనిక:
గర్భవతి లేదా పాలిచ్చే మహిళలు జాజికాయ పాలు తీసుకోవడానికి ముందు వైద్యుడిని సంప్రదించాలి. చిన్న పిల్లలకు జాజికాయ పాలు ఇవ్వకూడదు.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి