Tulsi Seeds: ఆయుర్వేదంలో తులసి ఆకులకు విశేష మహత్యముంది. తులసి ఆకుల్లోనే కాదు..తులసి గింజల్లో కూడా ఆరోగ్యం దాగుంది. ఆ ఉపయోగాలేంటో తెలుసుకుందాం..
తులసి మొక్క దాదాపుగా అందరి ఇళ్లలో ఉంటుంది. పెరట్లోనే లేదా కుండీలోనో అమర్చుకుంటుంటారు. ఈ మొక్కకు ఆయుర్వేద పరంగానే కాకుండా హిందూమతంలో కూడా ప్రాధాన్యత ఉంది. సాధారణంగా జలుబు, దగ్గు ఉన్నప్పుడు తులసి ఆకుల్ని ఉపయోగిస్తుంటాం. కానీ తులసి గింజలు కూడా ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరమని చాలా తక్కువ మందికి తెలుసు. ఇందులో ప్రోటీన్లు, ఫైబర్, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. తులసి గింజల ఉపయోగాలు చూద్దాం..
1. రోగ నిరోధక శక్తి ప్రాధాన్యత ఎప్పుడూ ఉంటుంది. చాలా రోగాల్నించి కాపాడేది ఇదే. కరోనా వైరస్ సమయంలో కూడా ఇమ్యూనిటీ కీలకపాత్ర పోషించింది. తులసి గింజలతో ఇమ్యూనిటీని వేగంగా పెంచవచ్చు.
2. ఒకవేళ మీకు అజీర్ణం, ఎసిడిటీ, గ్యాస్ సమస్య ఉంటే..తులసి గింజల్ని నీళ్లలో నానబెట్టాలి. ఈ నీళ్లను గింజలతో సహా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. గ్యాస్ సమస్య పోతుంది.
3. అధిక బరువుతో ఇబ్బంది పడేవారికి తులసి గింజలు అద్భుతమైన ఔషధంగా పనిచేస్తాయి. ఇందులో కేలరీలు తక్కువగా ఉండి..ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇవి తీనడం వల్ల త్వరగా ఆకలేయదు. క్రమంగా బరువు తగ్గుతారు.
4. తులసి గింజలతో మానసిక ఒత్తిడిని జయించవచ్చు. డిప్రెషన్ లేదా స్ట్రెస్‌తో బాధపడుతుంటే..తులసి గింజల్ని నానబెట్టి క్రమం తప్పకుండా తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebok