Telangana Inter Board: 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించిన జూనియర్ కళాశాలల క్యాలెండర్ ను ఇంటర్ బోర్డు ప్రకటించింది. దీని ప్రకారం, జూన్ 01 నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండియర్ తరగతులు ప్రారంభం కానున్నాయి. అక్టోబరు 6 నుంచి 13 వరకు దసరా సెలవులు ఇవ్వనున్నారు. ఆ తర్వాత నవంబరు 18-23 వరకు హాఫ్ ఇయర్ పరీక్షలు నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి సెలవులను జనవరి 11 నుండి 16 వరకు ఉంటాయి. అదే నెల 20 నుంచి 25 వరకు ఫ్రీపైనల్స్ జరుగుతాయి. ఫిబ్రవరి తొలి వారంలో ఫ్రాక్టికల్స్ నిర్వహిస్తారు. మార్చి మెుదటి వారంలో థియరీ పరీక్షలు జరపనున్నట్లు బోర్డు తెలిపింది.
రేపటి నుంచే వేసవి సెలవులు..
రీసెంట్ గా తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ముగిశాయి. ఈ నేపథ్యంలో సమ్మర్ హాలిడేస్ ను ప్రకటించింది ఇంటర్ బోర్డు. ఈ ఏడాది మెుదటి సంవత్సర విద్యార్థులకు మార్చి 30వ తేదీని లాస్ట్ వర్కింగ్ డేగా ప్రకటించింది. దీంతో రేపు అంటే మార్చి 31 నుండి మే 31 వతేదీ వరకు విద్యార్థులకు వేసవి సెలవులు ఉండనున్నాయి. జూన్ 01న తిరిగి కాలేజీలు తెరుచుకోనున్నాయి. ఈ ఆదేశాలను ప్రభుత్వ, ప్రవేట్ కళాశాలు తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచించారు. ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మే లోపే ఇంటర్ రిజల్ట్..
ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మెుత్తం 09 లక్షల మంది విద్యార్తులు పరీక్షలు రాశారు. వీరిలో మెుదటి సంవత్సరం 4,78,527 మంది, 4 లక్షలకుపైగా రెండో సంవత్సరం విద్యార్థులు ఉన్నారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో తొందరగా ఫలితాలు రిలీజ్ చేయాలని అధికారులు భావిస్తున్నారు. దీని కోసం వాల్యుయేషన్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నారు. మే నెల కంటే ముందు రిజల్ట్ అనౌన్స్ చేయాలని అనుకుంటున్నారు.
Also Read: Barrelakka Marriage: అంగరంగ వైభవంగా బర్రెలక్క రెండో వివాహం.. తరలివచ్చిన సోషల్ మీడియా అతిథులు
Also Read: New Rules: ఏప్రిల్ 1 నుంచి మారుతున్న కొత్త నిబంధనలు ఇవే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook