Delhi Assembly Polling 2025: దేశ రాజధాని శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఢిల్లీ ప్రజలు ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. సామాన్య ప్రజలతో పాటు పలువురు ప్రముఖులు కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు, పలు పార్టీల నేతలు ఇప్పటికే ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ ఓటు వేశారు. నిర్మాణ్ భవన్‌లోని పోలింగ్ కేంద్రంలో రాహుల్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. శాంతినికేతన్ కేంద్రంలో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురీ ఓటు వేశారు. అలాగే, సీఎం అతీశీ, ఆప్ నేత మనీశ్ సిసోడియా తన సతీమణితో కలిసి ఓటు వేశారు. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా.. మయూర్ విహార్‌లోని పోలింగ్ కేంద్రంలో తన సతీమణితో కలిసి ఓటు వేశారు.
పోలింగ్ సందర్భంగా ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో గందరగోళం తలెత్తింది. భారీగా రిగ్గింగ్ జరిగిందంటూ బీజేపీ నేతలు ఆరోపించడంతో ఉద్రిక్తతలకు దారితీసింది. సీలంపూర్, జంగ్ పురాలో, చిరాగ్ ఢిల్లీలో పలు పోలింగ్ కేంద్రాల వద్ద గందరగోళ వాతావరణం తలెత్తింది. సీలంపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ లో బురఖా ధరించిన కొంతమంది మహిళలు దొంగ ఓట్లు వేశారని బీజేపీ నేతలు ఆరోపించారు. దాంతో ఆమ్‌ఆద్మీ పార్టీ, బీజేపీల మధ్య వాగ్వాదం తలెత్తింది. రెండు వర్గాలు ఘర్షణ పడ్డాయి.
ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?
ఇదీ చదవండి: గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!
ఓవైపు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో ఆప్ అధినేత, మాజీ సీఎం కేజ్రీవాల్‌కు భారీ షాక్ తగిలింది... యమునా నది విషం అంశంలో కేజ్రీవాల్ పై హర్యానాలో కేసు నమోదయ్యింది. కేజ్రీవాల్ వ్యాఖ్యలపై షాబాద్‌కు చెందిన జగన్ మోహన్ అనే లాయర్ కురుక్షేత్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు. జగన్ మోహన్ ఫిర్యాదుపై కేజ్రీవాల్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. యమునా నది విషయంలో అసత్య ఆరోపణలతో కేజ్రీవాల్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఫిర్యాదు చేశారు జగన్ మోహన్.
ఇక ఆప్ ఎమ్మెల్యే దినేష్ మోహానియాపై కూడా కేసు నమోదైంది. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే దినేష్ ఓ మహిళకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవ్వగా.. ఆయనపై నెటిజన్లు కామెంట్ల రూపంలో విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆయనపై కేసు నమోదైనట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.