Haj 2021 application deadline extended: న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం హజ్ యాత్ర ( Haj 2021 ) దరఖాస్తు గడువును జనవరి 10వరకు పొడిగించింది. ఈ మేరకు కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ( Mukhtar Abbas Naqvi ) గురువారం ప్రకటించారు. ముంబైలోని హజ్ హౌస్‌లో కమిటీ సభ్యులతో జరిగిన సమావేశం అనంతరం ఆయన మాట్లాడారు. 2021 హజ్ యాత్రకు సంబంధించిన గడువు నిన్నటితో ( డిసెంబర్ 10 ) ముగిసిన నేపధ్యంలో మరోసారి పొడిగిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. కోవిడ్ (Coronavirus) నేపధ్యంలో వచ్చే ఏడాది జూన్-జూలై నెలల్లో జరిగే హజ్ యాత్ర భారత్, సౌదీ అరేబియా (Saudi Arabia) ప్రభుత్వాల మార్గదర్శకాల (Haj 2021 guidelines) ప్రకారం ఉంటుందని ఆయన తెలిపారు. Also read; West Bengal: బీజేపీ చీఫ్ నడ్డా కాన్వాయ్‌పై రాళ్ల దాడి
హజ్ ( Haj ) యాత్ర కోసం ఇప్పటివరకు 40వేలకు పైగా దరఖాస్తులు అందాయని, యాత్రికులు ఎంచుకునే ప్రయాణం ప్రకారం ఖర్చులో తేడా ఉంటుందని ముక్తార్ అబ్బాస్ నఖ్వీ తెలిపారు. ఈ దరఖాస్తుల్లో పురుషులు తోడు లేకుండా వెళ్లే మహిళల ( మెహ్రం ) నుంచి 500 దరఖాస్తులు అందినట్లు ఆయన వెల్లడించారు. మెహ్రం మహిళలను లాటరీ నుంచి మినహాయిస్తామని ఆయన తెలిపారు. హజ్ ( 2021 Haj ) యాత్రకు వెళ్లాలనుకునే వారు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ లేదా, హజ్ మొబైల్ యాప్ ( Haj Mobile app)లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ప్రయాణానికి ముందు కోవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్‌ను (Covid-19 certificate) ఖచ్చితంగా సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. Also read: Narendra Modi: కొత్త పార్లమెంట్ భవనానికి ప్రధాని శంకుస్థాపన
Also read: Health Benefits of Egg: ప్రతిరోజూ ‘గుడ్డు’ ఎందుకు తినాలో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe