న్యూఢిల్లీ: జేఈఈ మెయిన్ 2020 ఫలితాలు ( JEE main results 2020 ) విడుదలయ్యాయి. ఈ నెల 1 నుంచి 6 వరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన జేఈఈ మెయిన్ పరీక్ష ఫలితాలు ( NTA JEE main result 2020 ) శుక్రవారం రాత్రి వెల్లడి కాగా... ఈ ఫలితాల్లో తెలంగాణ విద్యార్థులు అత్యధిక సంఖ్యలో 100 పర్సంటైల్ స్కోర్ ( 100 percentile score ) సాధించి తమ సత్తా చాటుకున్నారు. దేశవ్యాప్తంగా 660 కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షలకు 8.67 లక్షల మంది అభ్యర్థులు హాజరు కాగా.. వారిలో 24 మంది విద్యార్థులు మాత్రమే 100 పర్సంటైల్ స్కోర్ సాధించారు. అందులో తెలంగాణ విద్యార్థులే ( Telangana students ) 8 మంది ఉండటం మరో విశేషం. ఆ 8 మంది విద్యార్థుల జాబితాలో వడ్డేపల్లి అరవింద్ కుమార్, చాగరి కౌశల్ కుమార్, చుక్క తనూజ్, శిక్ష కృష్ణ సగి, యశష్ చంద్ర, మోరెడ్డిగారి లిఖిత్‌రెడ్డి, రాచపల్లె శశాంక్ అనిరుధ్, రొంగల అరుణ్ సిద్ధార్థ ఉన్నారు. Also read : New Revenue Act 2020: కొత్త రెవెన్యూ చట్టానికి అసెంబ్లీ ఆమోదం.. రిజిస్ట్రేషన్ పని ఇక వారిదే
తెలంగాణ తర్వాత ఐదుగురు విద్యార్థులతో ఢిల్లీ రెండో స్థానంలో నిలవగా, నలుగురు విద్యార్థులతో రాజస్థాన్ మూడో స్థానంలో, ముగ్గురు విద్యార్థులతో ఆంధ్రప్రదేశ్ 4వ స్థానంలో నిలిచాయి. Also read : TS ECET counselling schedule: ఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ఇదిగో
JEE Main 2020 topper Akhil Jain అతడే జేఈఈ మెయిన్ టాపర్:
రాజస్థాన్‌కి చెందిన అఖిల్ జైన్ జేఈఈ మెయిన్ పరీక్ష ఫలితాల్లో టాపర్‌గా నిలిచాడు. అఖిల్ జైన్ తండ్రి ఓ వ్యాపారవేత్త కాగా తల్లి గృహిణి. చిన్నప్పటి నుంచి శాస్త్రవేత్త కావాలని భావించిన అఖిల్ జైన్‌కి ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ అంటే ప్రాణం. ముఖ్యంగా మ్యాథమేటిక్స్‌లో ఉండే సవాళ్లను ఎదుర్కోవడంలో మజాను ఆస్వాదించే తనకి ఐఐటిని ( IIT Aspirants ) లక్ష్యంగా పెట్టుకోవాల్సిందిగా ఇతరులు చేసిన సూచనలే బాగా పనిచేశాయని అఖిల్ జైన్ వెల్లడించాడు. Also read : Revanth Reddy's open letter: సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖతో ఎంపీ రేవంత్ రెడ్డి హెచ్చరిక
మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
- JEE Mains results 2020 : ఏ సమయంలో అయినా జేఈఈ మెయిన్స్ ఫలితాలు.. ఇలా చెక్ చేసుకోండి
- SBI home loans: ఇల్లు కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్ చెప్పిన ఎస్బీఐ
- TS POLYCET Result 2020: తెలంగాణ పాలిసెట్ 2020 ఫలితాలు విడుదల
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYeR