Kallakkadal: తమిళనాడు, కేరళ రాష్ట్రాలను వణికిస్తున్న ‘కల్లక్కడల్’ తుపాను.. తీర ప్రాంతాలకు అలర్ట్..

Kallakkadal: కేరళ, తమిళనాడు రాష్ట్రాలను ‘కల్లక్కడల్‌’ తుపాను హడలెత్తిస్తోంది. దీంతో తీర ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లమని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. తుపాను కారణంగా ముప్పు పొంచి ఉందని కేంద్ర ప్రభుత్వ సంస్థ ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది.

Written by - TA Kiran Kumar | Last Updated : Jan 15, 2025, 09:07 AM IST
Kallakkadal: తమిళనాడు, కేరళ రాష్ట్రాలను వణికిస్తున్న ‘కల్లక్కడల్’ తుపాను.. తీర ప్రాంతాలకు అలర్ట్..

Kallakkadal: జనవరి 15న రాత్రి అకస్మాత్తుగా సముద్రంలో వచ్చే ఉప్పెన కారణంగా బలమైన అలలు ఎగసిపడే అవకాశం ఉందని కేంద్ర వాతావరణ శాఖ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరికలు జారీ చేసింది. అంతేకాదు ముందుస్తుగా ఆయా రాష్ట్రాలకు కేంద్ర విపత్తుల నిర్వహణ సంస్థకు చెందిన వాళ్లను అక్కడ మోహరించింది. ఏ సమయంలో ఎలాంటి విపత్కర పరిస్థితులు సవాళ్లు ఎదుర్కొవడానికి రెడీ గా ఉంది. ఈ రోజు రాత్రి 11.30 గంటల వరకు తీరంలోని వివిధ ప్రాంతాల్లో 0.5 మీ. నుంచి 1 మీటర్ల మేర అలల తాకిడి ఉంటుందని తెలిపింది. సముద్ర అలలకు  ఉప్పెన ముప్పు పొంచి ఉందని ఇండియన్‌ నేషనల్ సెంటర్‌ ఫర్‌ ఓసియన్‌ ఇన్ఫర్మేషన్‌ సర్వీసెస్‌ హెచ్చరించింది.

కల్లక్కడల్‌ అనేది సముద్రంలో అకస్మాత్తుగా సంభవించే మార్పు. అంటే సముద్రం తెలియకుండా  దూసుకొస్తుంది. హిందూ మహాసముద్రంలోని దక్షిణ భాగంలో కొన్ని సార్లు వీచే బలమైన గాలులే సముద్రం ఇలా అకస్మాత్తుగా ఉప్పొంగడానికి కారణమవుతాయని వాతావరణ కేంద్ర నిపుణులు చెబుతున్నారు. ఎలాంటి సూచన, హెచ్చరిక లేకుండానే ఆ గాలులు వీస్తుంటాయి. 

నేషనల్ సెంటర్‌ ఫర్‌ ఓసియన్‌ ఇన్ఫర్మేషన్‌ సర్వీసెస్‌ సంస్థ ఇచ్చిన సమాచారం నేపథ్యంలో కేరళ విపత్తు ప్రతిస్పందన నిర్వహణ సంస్థ అప్రమత్తమైంది. అధికారుల సూచన మేరకు తీర ప్రాంత ప్రజలు సురక్షిత ప్రదేశాలకు తరలివెళ్లాలని సూచించింది. తీర ప్రాంత వాసులు ఎట్టి పరిస్థితుల్లో చిన్న పడవలు, దేశవాళీ పడవలు వేసుకొని సముద్రంలోకి చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. ముందుగానే పడవలను సురక్షిత ప్రదేశానికి తరలించాలని ప్రకటించింది. ప్రస్తుతం జారీ చేసిన ప్రకటనను విరమించుకొనే వరకు పర్యటకులు బీచ్‌లలో విహారానికి రావొద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. తీర ప్రాంతాలపై అదనపు నిఘా ఉంచాలని అధికారులకు ‘కేఎస్‌డీఎంఏ’ సూచించింది.

ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..

ఇదీ చదవండి: Prabhas Marriage: ప్రభాస్ మ్యారేజ్ ఫిక్స్.. డార్లింగ్ చేసుకోబోయేది ఈమెనే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News