PM's security lapse: పంజాబ్ ఉగ్ర కార్యకలాపాలకు కేంద్రంగా మారుతోందని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ (Kangana Ranaut Comments on Punjab) అన్నారు. పంజాబ్‌లో నిన్న ప్రధాని మోదీ కాన్వాయ్‌ను నిరసన కారులు అడ్డుకోవడంపై.. ఇన్స్టాగ్రామ్ వేదికగా తప్పుబడుతూ ఈ వాఖ్యలు చేశారు.
పంజాబ్‌లో జరిగిన ఘటన సిగ్గు చేటు చర్య అని అమె ఇన్స్టాగ్రామ్ స్టోరీలో (Kangana Instagram Story on PM Modi security lapse) రాసుకొచ్చారు. ప్రధాన మంత్రి ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నుకోబడిన నాయకుడని.. 140 కోట్ల మంది ప్రజల ప్రతినిధి/గొంతుక అని పేర్కొన్నారు.
అలాంటి వ్యక్తిపై దాడి ప్రతి భారతీయుడుపై దాడిగా పేర్కొన్నారు కంగనా రనౌత్. ఇది మన ప్రజాస్వామ్యంపై కూడా దాడి అని కంగన మండిపడ్డారు.
ఇప్పుడు అడ్డుకోకుంటే..
ఈ ఘటన నేపథ్యంలో పంజాబ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కంగనా రనౌత్. పంజాబ్ ఉగ్రకార్యకలాపాలకు కేంద్రంగా మారుతోందని.. ('Punjab is becoming a hub for terroristic activities') వాటిని ఇప్పుడు అడ్డుకోకుంటే.. దేశం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు.
#BharatStandwithModiji అనే ట్యాగ్‌తో కంగన ఈ స్టోరీనీ పోస్ట్ చేశారు.
అసలు ఏం జరిగిందంటే..
ప్రధాని మోదీ.. బుధవారం పంజాబ్ హుస్సేనీవాలాలోని జాతీయ అమరవీరుల స్మారకాన్ని సందర్శించాల్సి ఉంది. అయితే పంజాబ్ చేరుకున్న మోదీ.. వాతావరణ అనుకూలించక.. రోడ్డు మార్గంలో స్మారకం వద్దకు బయల్దేరారు. అయితే దారిలో నిరసనకారులు ప్రధాని కాన్వాయ్‌ను (PM Modi's convoy was stopped by protesters in Punjab) అడ్డగించారు. దీనితో ప్రధాని దాదాపు 20 నిమిషాలు కాన్వాయ్‌లోనే ఉండాల్సి వచ్చింది. నిరసనల కారణంగా ప్రధాని తన పర్యటనను రద్దు చేసుకుని ఢిల్లీ బయల్దేరాల్సి వచ్చింది. భద్రత లోపాల కారణంగానే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు హోం శాఖ సీరియస్ అయ్యింది.
ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఇప్పుడు తీవ్ర చర్చ సాగుతోంది. ప్రధాని కాన్వాయ్‌ను అడ్డుకోవడంపై బీజేపీ శ్రేణులు తీవ్రంగా (BJP on PM Modi security lapse) వ్యతిరేకిస్తున్నారు.
అయితే నిన్న జరిగిన ఈ ఘటన తర్వాత మోదీ క్షేమంగా బయటపడ్డందుకు పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీకి కృతజ్ఞతలు చెప్పడం (PM Modi Say thanks to CM Channi ) గమనార్హం.
Also read: Man Attacks Bindu Ammini: శబరిమల గుడిలోకి ప్రవేశించిన బిందు అమ్మినిపై దాడి.. వీడియో వైరల్
Also read: Tihar Jail Prisoner Suicide: తిహార్ జైలులో ఐదురుగు ఖైదీలు సూసైడ్ అటెంప్ట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook