Sankranti Special Trains: తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కు సంక్రాంతి అతిపెద్ద పండుగ. అందుకే సంక్రాంతి వచ్చిందంటే చాలు రైళ్లు, బస్సులు కిటకిటలాడుతుంటాయి. రద్దీ కారణంగా ఎన్ని ప్రత్యేక బస్సులు, రైళ్లు వేసినా సరిపోని పరిస్థితి ఉంటుంది. అందుకే దక్షిణ మధ్య రైళ్లు అదనంగా మరో 52 రైళ్లు నడిపేందుకు సిద్దమైంది. ఈ ప్రత్యేక రైళ్లకు బుకింగ్ కూడా ఓపెన్ అయింది.
సంక్రాంతికి అందరూ సొంత ఊర్లకు చేరుకుంటారు. ఉద్యోగ, వ్యాపార, చదువు నిమిత్తం వేర్వేరు రాష్ట్రాల్లో ఉన్నవాళ్లంతా సొంతూర్లకు రావల్సిందే. అందుకే రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో ఇటు ఏపీఎస్సార్టీసీ, అటు తెలంగాణ ఆర్టీసీ రెండూ ప్రత్యేక బస్సులు నడుపుతున్నాయి. దక్షిణ మధ్య రైల్వే ఇప్పటికే కొన్ని ప్రత్యేక రైళ్లు ప్రవేశపెట్టింది. తాజాగా మరో 52 రైళ్లు ప్రకటించింది. సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకుని కాచిగూడ, సికింద్రాబాద్, చర్లపల్లి రైల్వే స్టేషన్ల నుంచి కాకినాడ, నర్శాపురం, తిరుపతి, శ్రీకాకుళం జిల్లాలకు ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. ఈ నెల 6వ తేదీ నుంచి 18 వరకూ ఈ ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయి.
చర్లపల్లి నుంచి తిరుపతి, తిరుపతి నుంచి చర్లపల్లికి ఈనెల 6,7,8,9,11,12,15,16 తేదీల్లో ప్రత్యేక రైళ్లున్నాయి. ఇక వికారాబాద్ నుంచి కాకినాడకు ఈనెల 13న ప్రత్యేక రైలుంది. కాకినాడ నుంచి చర్లపల్లికి ఈ నెల 14న మరో రైలు నడవనుంది. ఇక కాచీగూడ నుంచి తిరుపతికి ఈ నెల 9,16 తేదీల్లోనూ, తిరుపతి నుంచి కాచీగూడకు ఈనెల 10, 17 తేదీల్లోనూ ప్రత్యేక రైళ్లు ఏర్పాటయ్యాయి. చర్లపల్లి నుంచి నర్శాపూర్, నర్శాపుర్ నుంచి చర్లపల్లికి ఈ నెల 11, 2, 18,19 తేదీల్లో ప్రత్యేక రైళ్లున్నాయి. ఇక సికింద్రాబాద్ నుంచి కాకినాడకు, కాకినాడ నుంచి సికింద్రాబాద్ కు ఈ నెల 12,19 తేదీల్లో స్పెషల్ రైళ్లు బయలుదేరనున్నాయి.
చర్లపల్లి నుంచి నర్శాపురం, నర్శాపురం నుంచి చర్లపల్లికి ఈ నెల 7,8,9,10,13,14,15,16,17,18 తేదీల్లో ప్రత్యేక రైళ్లు ఉన్నాయి. ఇక చర్లపల్లి నుంచి కాకినాడ, కాకినాడ నుంచి చర్లపల్లికి ఈ నెల 8,9,10,11,12,13,14,15 తేదీల్లో ప్రత్యేక రైళ్లు ఏర్పాటయ్యాయి. ఇక నాందేడ్ నుంచి కాకినాడ, కాకినాడ నుంచి నాందేడ్ కు ఈ నెల 6,7,13,14 తేదీల్లో ప్రత్యేక రైళ్లున్నాయి. చర్లపల్లి నుంచి శ్రీకాకుళం, శ్రీకాకుళం నుంచి చర్లపల్లికి ఈ నెల 9,10,12,13,14, 15 తేదీల్లో ప్రత్యేక రైళ్లు తిరగనున్నాయి. ఇక చివరిగా కాచీగూడ నుంచి శ్రీకాకుళం, శ్రీకాకుళం నుంచి కాచీగూడకు ఈ నెల 7, 8 తేదీల్లో ప్రత్యేక రైళ్లు సిద్ధంగా ఉన్నాయి. ఈ రైళ్లకు బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.