Union Cabinet: పలు రైల్వే ప్రాజెక్టులకు పచ్చజెండా..కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..!

Union Cabinet: ప్రధాని మోదీ అధ్యక్షతన భేటీ అయిన కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పలు రైల్వే ప్రాజెక్టులతోపాటు ఉద్యోగులకు డీఏ పెంపుపై పచ్చజెండా ఊపారు.

Written by - Alla Swamy | Last Updated : Sep 28, 2022, 08:37 PM IST
  • కేంద్ర కేబినెట్ భేటీ
  • పలు కీలక నిర్ణయాలు
  • కీలక ప్రాజెక్టులకు పచ్చజెండా
Union Cabinet: పలు రైల్వే ప్రాజెక్టులకు పచ్చజెండా..కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..!

Union Cabinet: దేశంలోని మూడు ప్రధాన నగరాల్లో రైల్వే స్టేషన్లను మరింతగా అభివృద్ధి చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ప్రధాని మోదీ అధ్యక్షతన భేటీ అయిన కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఢిల్లీ, అహ్మదాబాద్, ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ రైల్వే స్టేషన్లను రూ.10 వేల కోట్లతో ఆధునీకరించనున్నారు. వీటికి కొత్త హంగులు తీసుకొచ్చేందుకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. 

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంచేందుకు అంగీకరించారు. కరవు భత్యం 4 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. కరోనా సంక్షోభం నుంచి పంపిణీ చేస్తున్న ఉచిత రేషన్ బియ్యాన్ని డిసెంబర్ 31 వరకు కొనసాగించాలని నిర్ణయించారు. కేంద్ర కేబినెట్ వివరాలను కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ వివరించారు. 199 రైల్వే స్టేషన్లను తొలి దశలో ఆధునీకరించనున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే 47 స్టేషన్లకు టెండర్లు ముగిశాయి.

మరో 32 స్టేషన్లలో పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఢిల్లీలో స్టేషన్‌ అభివృద్ధి పనులను మూడున్నరేళ్లలో పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నామని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. విశాఖ రైల్వే జోన్‌పై కట్టుబడి ఉన్నామన్నారు. ప్రయాణికులకు ఒకే చోట అన్ని వసతులు ఉండేలా కెఫిటేరియాలు, ఫుడ్ కోర్టులు, వెయిటింగ్ లాంజ్, పిల్లలు ఆడుకునేందుకు కొన్ని వస్తువులు ఉండేలా రైల్వే స్టేషన్లను తీర్చిదిద్దుతామన్నారు. జులై నుంచి పెంచిన డీఏ అమల్లోకి రానుంది. ఈవిషయాన్ని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. 

తాజా పెంపుతో డీఏ 38 శాతానికి పెరిగింది. దీంతో సుమారు 50 లక్షల మంది ఉద్యోగులు, 62 లక్షల మంది పెన్షనర్లు ప్రయోజనం పొందనున్నారు. ఉచిత రేషన్ పథకాన్ని మరికొన్ని రోజులు పొడిగించారు. ముందుగా నిర్ణయించిన తేదీ ఈనెల 30తో ముగియనుంది. ఐతే పేదలకు అండగా ఉండాలన్న ఉద్దేశంతోనే మరో మూడు నెలలు పొడిగించామని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. దీని వల్ల కేంద్ర ప్రభుత్వంపై రూ.44 వేల 700 కోట్ల మేర అదనపు భారం పడనుంది. డిసెంబర్ 31న ఉచిత రేషన్ పథక గడువు ముగియనుంది.

Also read:CM Jagan: ఆ 27 మంది పని తీరు మార్చుకోవాలి..నేతలకు సీఎం జగన్ స్వీట్ వార్నింగ్..!

Also read:Actor Ali: వైసీపీని వీడే ప్రసక్తే లేదు..సీఎం వైఎస్ జగనే నా నేత: ఆలీ..! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News