బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంలో.. శనివారం ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. 2019 ఎన్నికల్లో శివసేనతో కలిసి పోటీ చేస్తామని అమిత్ షా అన్నారు. శివసేన ఇప్పటికీ మహారాష్ట్రలో, కేంద్రంలో మాతోనే కలిసే ఉందని అన్నారు.
"I repeat this, that we want Shivsena and BJP to fight together in 2019 elections," says Amit Shah. The BJP Pres says, "you should ask them" when asked that 'Shiv Sena doesn't want to fight together' and adds that still they are together in both centre & Maharashtra governments pic.twitter.com/yb3LOuRk7h
— ANI (@ANI) May 26, 2018
2014 ఎన్నికల తర్వాత 11 పార్టీలు ఎన్డీఏలో చేరాయని దాంతో కూటమి మరింత బలపడిందన్నారు. ఎన్డీఏ కూటమి నుంచి చంద్రబాబు నాయుడు తప్పుకున్నా మా కూటమిలోకి నితీశ్ కుమార్ వచ్చారని అమిత్ షా అన్నారు. దేశాభివృద్ధి కోసం ప్రధాని మోదీ రోజులో 18 గంటలు కష్టపడుతున్నారని.. మోదీ తమకు నాయకుడవ్వడం గర్వంగా ఉందన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నాయకుడ్ని దేశానికి అందించిన ఘనత భాజపాదేనన్నారు.
నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలన్నీ నెరవేర్చిందని అమిత్‌షా అన్నారు. పేదలు, రైతుల అభివృద్ధికి మోదీ ఎంతో కృషి చేశారని.. అవినీతి రహిత పాలన అందించారని అన్నారు.
పెట్రో, డీజిల్ ధరలను తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని అమిత్‌షా తెలిపారు. పాకిస్థాన్‌తో యుద్ధం చేయాలన్నది లాస్ట్ ఆప్షన్ మాత్రమేనని, సరిహద్దు రక్షణ విషయంలో వెనక్కి తగ్గమమన్న ఆయన.. బీజేపీ హాయంలోనే ఎక్కువ మంది ఉగ్రవాదులు చనిపోతున్నారని అన్నారు.