World Highest Rail Bridge: భూతల స్వర్గం జమ్ముకశ్మీర్ అరుదైన ఖ్యాతి దక్కించుకుంది. పర్యాటక స్వర్గంలో మరో కలికితురాయి చేరింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన ప్రారంభమైంది.
జమ్ముకశ్మీర్ అభివృద్ధిలో కీలకమైన అఛీవ్‌మెంట్. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన ఇవాళ ఆగస్టు 13న ప్రారంభమైంది. సింగిల్ ఆర్చ్ రైల్ బ్రిడ్జి చీనాబ్ నదిపై నిర్మితమైంది. అందుకే దీనిని చీనాబ్ రైల్వే బ్రిడ్జిగా పిలుస్తున్నారు. స్వాతంత్య్రం వచ్చాక శ్రీ నగర్‌తో దేశంలోని మిగిలిన ప్రాంతాల్ని కలపడం ఇదే తొలిసారి. చీనాబ్ రైల్వే వంతెనతో ఇది సాధ్యమైంది. ప్రపంచంలో ఇదే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జిగా ఉంది.
చీనాబ్ నదీ లోయలోని రెండు చివర్లను ఈ బ్రిడ్జి కలిపింది. రెండు వైపుల్నించి ఆర్చ్ మీదుగా బ్రిడ్జి స్ట్రక్చర్‌ను నెమ్మదిగా ముందుకు జరుపుతూ కట్టిన నిర్మాణమిది. ఇదొక సుదీర్ఘ ప్రయాణమని..గోల్డెన్ జాయింట్‌ను సివిల్ ఇంజనీర్లు అద్భుతంగా కలపగలిగారని కొంకణ్ రైల్వే ఛైర్మన్ సంజయ్ గుప్త తెలిపారు. ప్రపంచంలో ఇదే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన అని చెప్పారు. గోల్డెన్ జాయింట్ పూర్తవడంతో 98 శాతం పని పూర్తయిపోయందని తెలిపారు.
ఇండియా సాధించిన ఈ ఘనతపై ప్రపంచమంతా ఆసక్తిగా గమనించింది. చాలా సవాళ్లను ఎదుర్కొని బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసింది. ప్రపంచంలో ఎత్తైన ఈఫిల్ టవర్ కంటే 35 మీటర్ల ఎత్తైంది ఈ బ్రిడ్జి. ప్రమాదకరమైన జమ్ముకాశ్మీర్ ప్రాంతంలో కొంకణ్ రైల్వే మరో 16 రైల్వే బ్రిడ్జిల నిర్మాణం చేపడుతోంది. ఈ వంతెనలన్నీ ఉధమ్‌పూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్ లింక్ ప్రాజెక్టు లో భాగమే. ఈఫిల్ టవర ఎత్తు 324 మీటర్లు కాగా..చీనాబ్ రైల్వే వంతెన ఎత్తు 359 మీటర్లుగా ఉంది.
Also read: Monekypox Cases Updates: ఢిల్లీలో ఐదో మంకీపాక్స్ కేసు... ఆసుపత్రిలో చేరిన 22 ఏళ్ల యువతి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook