Coronavirus: కరోనావైరస్ వల్ల వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వారి సంఖ్య ఎక్కువే ఉంది. ఇంట్లో కూర్చుని వర్క్ అప్లోడ్ చేయడమే కాదు.. ఫుడ్ అప్లోడింగ్ కూడా పెరిగింది. ఫలితంగా ఇన్ని సంవత్సరాల్లో పెరగని బరువు కూడా పెరిగింది అని చాలా మంది ఫీల్ అవుతున్నారు. పైగా వర్కవుట్స్ కూడా చేయనంత బద్దకం పెరగడంతో సైలెంట్‌గా పొట్ట చిన్నపాటి గుట్టలా మారిపోయింది అని వారు ఫీల్ అవుతున్నారు.
ALSO READ| Pregnancy in Covid-19 Time: కోవిడ్-19 సోకకుండా గర్భిణిలు ఏం చేయాలి ? వస్తే పాలు ఇవ్వవచ్చా ?
అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే పొట్టను, అధిక బరువును సులభంగా తగ్గించుకోవచ్చు...
పాలకూర...
పాలకూర గురించి చాలా మందికి తెలియన విషయం ఏంటంటే.. ఇది కొవ్వును (Fat) కరిగించడంలో ఎక్స్‌పర్ట్. ఇందులో కేలరీస్ తక్కువగా ఉంటాయి. పాలకూరను పవర్ హౌజ్ వెజిటెబుల్ అంటారు. ఇందులో ఉండే ఫైబర్ వల్ల మీరు కావాల్సినంత మాత్రమే తింటారు. అధిక ఆహారం తినకుండా పాలకూర కంట్రోల్ చేయగలదు.
పుట్టగొడుగులు...
మష్రూమ్స్ వినియోగం ఈ మధ్య బాగా పెరిగింది. ఇందులో పోషక గుణాలు ఉండటం మాత్రమే కాదు.. దీని వల్ల బరువు తగ్గుతారు అని తెలిసి చాలా మంది తమ డైట్‌లో భాగం చేసుకుంటున్నారు. పుట్టగొడుగుల రక్తంలో చెక్కర శాతాన్ని అదుపు చేయగలవు. మధుమేహాన్ని (Diabetes) అదుపుచేయగలవు.
ALSO READ| Quarantine Tips: హోమ్ క్వారంటైన్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
బ్రకోలి...
బ్రకోలీలో ఫైబర్ అధికంగా ఉంటుంది. దీని వల్ల ఊరికే ఏదైనా తినాలి అనే కోరిక కలగదు. చాలా సమయం మీకు ఆకలి వేయదు. ఇందులో ఉండే ఫిటో కెమికల్స్ వల్ల కొవ్వు సులభంగా కరుగుతుంది. ఇమ్యూనిటీని పెంచుతుంది. విటమిన్ సీ శాతం అధికం.
కీరా
కీరాలో ఫైబర్, నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. బాడీని డీటాక్సిఫై చేస్తుంది. ఇందులో కేలరీస్ శాతం తక్కువగా ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe