Curry Leaves For Diabetes Patient: ప్రతి వంటకాల్లో భారతీయులంతా కరివేపాకులను వినియోగిస్తారు. ఇందులో ఉండే సుగంధం వంటకాల రుచిని పెంచుతుంది. ఇది రుచిని పెంచడమే కాకుండా శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను చేకూర్చుతుందని ఆయుర్వేద నిపుణులు పేర్కొన్నారు. ఇందులో ఎన్నో అద్భుతమైన శక్తులు ఉన్నాయని ఈ ఆకులను ఉపయోగించి పూర్వీకులు అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందే వారిని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇందులో ఉండే గుణాలు రోగనిరోధక శక్తిని పెంచి అనారోగ్య సమస్యల నుంచి శరీరాన్ని కాపాడేందుకు కీలక పాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా వాతావరణ మార్పుల వల్ల వచ్చే వ్యాధుల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తాయి.
కరివేపాకు ఆహారంలో వినియోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు:
కొలెస్ట్రాల్ సమస్యలకు చెక్:
చాలామంది ఆధునిక జీవనశైలిని అనుసరించడం వల్ల చెడుకోలస్ట్రాల్ సమస్యల బారిన పడుతున్నారు. శరీరంలో స్థాయికి మించి కొలెస్ట్రాల్ పెరిగితే అది తీవ్ర అనారోగ్య సమస్యలకు దారి తీసే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా గుండెపోటు సమస్యలకు గురవుతారు. అయితే కర్వేపాకును తరచుగా ఆహారాల్లో వినియోగించడం వల్ల సులభంగా ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.
మధుమేహం నుంచి ఉపశమనం:
ఆయుర్వేద శాస్త్రంలో కరివేపాకు దివ్యౌషధంగా భావిస్తారు. ఇందులో ఉండే గుణాలు రక్తంలోని చక్కర పరిమాణాలను నియంత్రించి మధుమేహాన్ని సులభంగా తగ్గిస్తుంది. అంతేకాకుండా తీవ్ర అనారోగ్య సమస్యలైనా గుండె జబ్బులు, ఊపిరితిత్తుల వ్యాధుల నుంచి కూడా విముక్తి కల్పిస్తుంది.
మెరుగైన కంటిచూపు:
ఆధునిక జీవన శైలి కారణంగా చాలామందిలో కంటిచూపు మందగిస్తోంది. కంటి చూపు మందగించడానికి ప్రధాన కారణాలు శరీరంలో విటమిన్ ఏ లోపమేనని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆయుర్వేద నిపుణులు సూచించిన కరివేపాకు ను తీసుకునే ఆహారంలో అతిగా వినియోగించాల్సి ఉంటుంది.
వికారం:
ఉదయం మేల్కొన్న తర్వాత వికారం లేదా మైకము వంటి సమస్యలతో బాధపడుతుంటారు. అయితే ఈ వ్యాధుల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి కరివేపాకుతో తయారుచేసిన టీని రోజుకు రెండు పూటలా తాగాల్సి ఉంటుంది. ఇలా ప్రతిరోజు తాగడం వల్ల అనారోగ్య సమస్యలు తగ్గడమే కాకుండా పై సమస్యలన్నీ దూరమవుతాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Faceboo