PM Awas Yojana: ప్రధాని మోదీ డబ్బులు తీసుకుని ప్రియులతో భార్యలు పరార్‌

PMAY 11 Married Women Jump With His Boyfriends: ప్రభుత్వ పథకం డబ్బులు పొందారు ఆ వెంటనే తమ భర్తలను వదిలేసి భార్యలు తమ ప్రియులతో పరారయ్యారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jul 9, 2024, 03:34 PM IST
PM Awas Yojana: ప్రధాని మోదీ డబ్బులు తీసుకుని ప్రియులతో భార్యలు పరార్‌

Wives Run Away With Lovers: కేంద్ర ప్రభుత్వం పేదలకు అందిస్తున్న పథకాన్ని లబ్ధి పొందిన కొందరు మహిళలు ఆ డబ్బును ఊహించని రీతిలో వినియోగించుకున్నారు. మోదీ సర్కార్‌ ఇచ్చిన డబ్బులను తీసుకుని మహిళలు తమ భర్తలను వదిలేశారు. ప్రభుత్వ డబ్బులు తీసుకుని తాము ప్రేమించిన ప్రియులతో పరారయ్యారు. దీంతో భర్తలంతా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ప్రభుత్వ సొమ్ము విషయమై విచారణకు వచ్చిన అధికారులు భార్యలు వెళ్లిపోయిన విషయం తెలుసుకుని విస్తుపోయారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.

Also Read: Stag Beetle: బీఎండబ్ల్యూ, బెంజ్‌ కారు కన్నా ఈ పురుగు చాలా కాస్టిలీ.. ఏమంత స్పెషలో తెలుసా?

 

కేంద్ర ప్రభుత్వం పీఎం ఆవాస్‌ యోజన అమలు చేస్తున్న విషయం తెలిసిందే. పేద, దిగువ మధ్య తరగతి కుటుంబాల సొంత ఇల్లు కల సాకారం చేసేందుకు ఈ పథకం కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుంటుంది. ఈ పథకానికి యూపీలోని మహారాజ్‌గంజ్‌ జిల్లాలో పెద్ద ఎత్తున ప్రజలు దరఖాస్తు చేసుకున్నారు. ఆ జిల్లాలోని తుతుబరి, షీత్లాపూర్‌, చాటియా, రాంనగర్‌, బకుల్‌ దిహా, ఖస్రా, కిషున్‌పూర్‌, మౌధౌలి తదితర గ్రామాలకు చెందిన 2,350 మంది ప్రజలు పీఎం ఆవాస్‌ యోజన కింద డబ్బులు పొందారు. తొలి విడతగా రూ.40 వేల చొప్పున అకౌంట్లలో డబ్బులు జమ అయ్యాయి. అయితే ఆ జిల్లాలో ఈ పథకం ద్వారా లబ్ధిపొందిన 11 మంది మహిళలు ఇంటిని వదిలేసి పరారయ్యారు.

Also Read: Third Marriage: అదృష్టమంటే పండన్నదే.. భర్తకు మూడో పెళ్లి జరిపించిన ఇద్దరు భార్యలు

 

ఇంటిని.. కట్టుకున్న భర్తను వదిలేసి వాళ్లు వెళ్లిపోయారు. అయితే డబ్బులు మంజూరు చేసినా కూడా ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించకపోవడంతో అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లారు. ఇంటి నిర్మాణ ఎందుకు మొదలుపెట్టలేదని అధికారులు భర్తలను ప్రశ్నించడంతో భార్యలు చేసిన బాగోతం బయటపడింది. అధికారుల సూచనతో భర్తలందరూ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. కాగా ఇలాంటి ఘటనలు గతేడాది కూడా చోటుచేసుకోవడం గమనార్హం.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News