Sarvartha Siddhi Yoga: ఈ రాశుల వారిపై సర్వార్ధ సిద్దయోగం ఎఫెక్ట్.. గోల్డెన్ డేస్‌తో పాటు లగ్జరీ లైఫ్ ప్రారంభం..

Sarvartha Siddhi Yoga Effects: జ్యోతిష శాస్త్రంలో ఎంతో కీలకమైన సర్వార్ధ సిద్ధ యోగం ఏర్పడింది. ఈ యోగం ఏర్పడడం కారణంగా కొన్ని రాశుల వారికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో బాధపడే వారికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 27, 2023, 12:13 PM IST
 Sarvartha Siddhi Yoga: ఈ రాశుల వారిపై సర్వార్ధ సిద్దయోగం ఎఫెక్ట్.. గోల్డెన్ డేస్‌తో పాటు లగ్జరీ లైఫ్ ప్రారంభం..

Sarvartha Siddhi Yoga Effects: జ్యోతిష్య శాస్త్రంలో ప్రత్యేక యోగాలకు చాలా ప్రాముఖ్యత ఉంది జాతకంలో శుభస్థానంలో ప్రత్యేక యోగం ఏర్పడితే డబ్బు, విజయానికి ఎలాంటి కోరతా ఉండదు. ఈ ప్రత్యేక యోగాలు అనేది రెండు రాశుల కలయిక ద్వారా ఏర్పడతాయి. అంతేకాకుండా కొన్ని ముఖ్యమైన గ్రహాలు వాటి స్థితులను మార్చుకున్నప్పుడు కూడా ఇలాంటి యోగాలు ఏర్పడతాయి. ఇటీవలే చంద్ర గ్రహం కుంభరాశి నుంచి మీన రాశిలోకి సంచారం చేసింది. విగ్రహం మీనరాశిలోకి చాలా అరుదుగా సంచారం చేస్తుంది. ఈ సంచారం కారణంగా సర్వార్ధ సిద్ధ రాజయోగం ఏర్పడింది. ఈ యోగ ప్రభావం కొన్ని రాశుల వారిపై దీర్ఘకాలం పాటు పడుతుంది. దీనికి కారణంగా ఆ రాశుల వారు ఎలాంటి పనులు చేసిన సులభంగా విజయాలు సాధిస్తారు.

మిథున రాశి:
ఈ సర్వార్ధ సిద్ధ యోగం కారణంగా మిధున రాశి వారికి చాలా శుభ్రంగా ఉంటుంది. ముఖ్యంగా వృత్తి జీవితం గడుపుతున్న వారికి అనేక రకాల మార్పులు వచ్చి ఆదాయం పెరుగుతుంది. కష్టపడి పనిచేయడం వల్ల ప్రశంసలు కూడా లభిస్తాయి. ముఖ్యంగా ఉద్యోగాలు చేసేవారు ఈ సమయంలో కొత్త బాధ్యతలు కూడా పొందుతారు. కుటుంబ జీవితం గడుపుతున్న వారి కూడా ఈ సమయం ఆనందదాయకంగా ఉంటుంది. విదేశాల్లో చదవాలనుకుంటున్న వారికి వారి కోరిక సులభంగా నెరవేరుతుంది. దీంతోపాటు ఈ రాశి వారు విహారయాత్రలకు కూడా వెళ్తారు.

సింహరాశి:
సింహ రాశి వారికి కూడా ఈ సర్వార్ధ సిద్ధ రాజయోగం చాలా ప్రయోజనకరంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ రాశి వారికి హనుమంతుని అనుగ్రహం లభించి, ఎలాంటి కఠినవతరమైన పనుల్లోనైనా సులభంగా విజయాలు సాధించగలుగుతారు. దీంతో పాటు వీరు స్నేహితుల సపోర్ట్ లభించి ఆర్థికంగా బలపడతారు. అంతేకాకుండా మానసిక ప్రశాంతత కోసం విహారయాత్రలకు కూడా వెళ్తారు. ఇక భార్యాభర్తల మధ్య మనస్పర్దలు ఉన్నవారికి ఈ సమయంలో పరిష్కారం లభిస్తుంది. ఇంతకుముందున్న అపార్ధాలన్ని సులభంగా తొలగిపోతాయి.

కన్యా రాశి:
కన్యా రాశి వారికి కూడా ఈ సర్వార్ధ సిద్ధ రాజయోగం కారణంగా అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి కష్టపడి పనిచేస్తున్న వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. దీంతో పాటు వీరు ఎలాంటి పనులైన సులభంగా చేయగలుగుతారు. అయితే కుటుంబ సభ్యులతో అనవసరమైన చర్చలకు దూరంగా ఉండాలి. ఒంటరి జీవితం గడుపుతున్న వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. దీంతో పాటు వివాహాలు చేసుకోవాలనుకునే వారికి మంచి జీవిత భాగస్వామి లభిస్తుంది. బిజినెస్ రంగంలో ఉన్నవారు వ్యాపారాలు విస్తరించి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంతక ముందు ఉన్న పెండింగ్లో పనులన్నీ సులభంగా పరిష్కారం అవుతాయి. 

Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం

తులారాశి:
తులా రాశి వారికి కూడా ఈ ప్రత్యేక యోగం కారణంగా అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వ్యాపారాలు చేసేవారు అనేక రకాల ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. కుటుంబ సభ్యుల నుంచి మంచి సపోర్ట్ లభించి, అనేక పనుల్లో విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా ఒత్తిడి మానసిక సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా ఈ సమయం గొప్ప ఉపశమనం ఇస్తుంది. ఇక ఉద్యోగాలు చేస్తున్న వారికి కార్యాలయాల్లో గొప్ప ప్రశంసలు లభిస్తాయి. అంతేకాకుండా చిన్నపిల్లలతో సరదాగా గడిపే అవకాశాలు కూడా లభిస్తాయి.

Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News