Tirumala Darshan April Quota: కలియుగ ప్రత్యక్ష దైవంగా కీర్తి పొందిన తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలనుకునే భక్తలకు భారీ శుభవార్త. ఏప్రిల్ నెలకు సంబంధించిన ప్రత్యేక పూజా సేవలు, దర్శన టికెట్ల విడుదల తేదీలు వెల్లడయ్యాయి. వేసవి సెలవులు ఉన్న నేపథ్యంలో ఆ సమయంలో తిరుమలను దర్శించుకోవాలంటే కొంత కష్టంగా ఉంటుంది. టికెట్లు పొందితే వేసవి సెలవుల్లో శ్రీవారిని ప్రశాంతంగా దర్శించుకోవచ్చు. ఏప్రిల్ కోటా తిరుమల తేదీలు ఇలా ఉన్నాయి.
Also Read: Vizag Steel Plant: ఆంధ్రప్రదేశ్‌కు భారీ కానుక.. విశాఖ స్టీల్‌కు రూ.11,440 కోట్ల ఆర్థిక ప్యాకేజీ
ఏప్రిల్ నెలలో తిరుమలలో కొన్ని ప్రత్యేక ఉత్సవాలు కూడా జరగనున్నాయి. ఆర్జిత సేవలు సుప్రభాతం, తోమాల సే, అర్చనతోపాటు అంగ ప్రదక్షిణం, శ్రీవాణి టికెట్లు, వృద్ధులు, దివ్యాంగుల దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల తేదీలను అధికారులు విడుదల చేశారు. ఏప్రిల్ కోటా టికెట్లను జనవరి 18వ తేదీన ఆన్‌లైన్‌లో విడుదల చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. టికెట్ల కోసం నిర్ధిష్ట తేదీ, సమయంలో పొందాలని సూచించింది. టీటీడీ వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: Chandrababu Tour: వైఎస్ జగన్ అడ్డాలో సీఎం చంద్రబాబు.. రేపు ఏం జరగనుంది?
ఈ టికెట్ల నమోదు
ఈ టికెట్ల కోసం జనవరి 18 నుంచి 20వ తేదీల్లో ఉదయం గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు
ప్రత్యేక ఉత్సవాలు
తిరుమలలో ఏప్రిల్ 10 నుంచి 12వ తేదీ వరకు స్వామివారి సాలకట్ల వసంతోత్సవాలు, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలు జరగనున్నాయి. ఈ సేవలకు సంబంధించి టికెట్లను జనవరి 21వ తేదీన ఉదయం 10 గంటలకు విడుదల కానున్నాయి. వర్చువల్ సేవలు, దర్శన స్లాట్ల కోసం ఏప్రిల్ కోటాను జనవరి 21వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు.
దర్శన టికెట్ల తేదీలు, సమయం
జనవరి 23వ తేదీ: ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణం కోటా
జనవరి 23వ తేదీ: ఉదయం 11 గంటలకు శ్రీవాణి టికెట్ల ఆన్‌లైన్ కోటా
జనవరి 24వ తేదీ: ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.300) టికెట్ల కోటా
జనవరి 24వ తేదీ: మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల తిరుపతిలో గదుల కోటా
జనవరి 27వ తేదీ: ఉదయం 11 గంటలకు శ్రీవారి సాధారణ సేవ కోటా
జనవరి 27వ తేదీ: మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవారి నవనీత సేవ కోటా
జనవరి 27వ తేదీ: మధ్యాహ్నం 1 గంటలకు శ్రీవారి పరకామణి సేవ కోటా
అధికారిక సైట్ లోనే..
దర్శన టికెట్లు, స్వామివారి ఆర్జిత సేవలు, గదుల బుకింగ్ వంటి సేవలన్నింటిని కేవలం తిరుమల తిరుపతి దేవస్థానం అధికారిక వెబ్‌సైట్, యాప్‌లలో మాత్రమే చేసుకోవాలని టీటీడీ సూచించింది. https://ttdevasthanams.ap.gov.in లో మాత్రమే చేసుకోవాలని టీటీడీ తెలిపింది. ఇతర వెబ్‌సైట్లు, యాప్‌లను నమ్మి మోసపోవద్దని జాగ్రత్తలు చెప్పింది. భక్తులు గమనించి జాగ్రత్త పడాలని పేర్కొంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.