IND VS SA 02nd Test Updates: రెండో టెస్టుకు అవేశ్ ఖాన్‌.. ష‌మీ స్థానంలో..

Cape town test Updates: రెండో టెస్టుకు షమీ స్థానంలో అవేశ్ ఖాన్‌ను తీసుకున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. జనవరి 03 నుంచి సెకండ్ టెస్టు మెుదలు కానుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 29, 2023, 07:55 PM IST
IND VS SA 02nd Test Updates: రెండో టెస్టుకు అవేశ్ ఖాన్‌.. ష‌మీ స్థానంలో..

Avesh Khan Replaced Shami: కేప్‌టౌన్‌ వేదికగా జనవరి 03 నుంచి సౌత్రాఫికా-టీమిండియాల రెండో టెస్టు ప్రారంభం కానుంది. అయితే ఈ టెస్టుకు ముందు భారత జట్టులో కీలక మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. గాయంతో దక్షిణాప్రికా పర్యటనకు దూరమైన షమీ స్థానాన్ని ఆవేశ్ ఖాన్ భర్తీ చేయనున్నాడు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది బీసీసీఐ. దీంతో రెండో టెస్టులో ఆవేశ్ బరిలోకి దిగే అవకాశం ఉంది. అయితే తొలి టెస్టులో షమీ ఆడలేదు, కానీ  తొలుత రెండో టెస్టుకు ఎంపిక చేశారు. షమీ పూర్తి ఫిట్ నెస్ సాధించకపోవడంతో అతడి ఫ్లేస్ లో ఆవేశ్ ను తీసుకున్నారు. త్వరలోనే ఈ యంగ్ ప్లేయర్ జట్టుతో కలవనున్నాడు. 

ఇటీవల జరిగిన తొలిటెస్టులో భారత్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఇన్నింగ్స్ 32 ర‌న్స్ తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ ఓడిపోవడ వల్ల ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ 2023-25 పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ ను కోల్పోయింది. అంతేకాకుండా ఐదో స్థానానికి దిగజారింది. ఇదే సమయంలో సఫారీ జట్టు నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. దక్షిణాప్రికా తర్వాత స్థానాల్లో పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్టు ఉన్నాయి. ఆస్ట్రేలియా ఆరో స్థానంలో కొనసాగుతోంది. అయితే ప్రోటీస్ తో జరిగిన తొలి టెస్టులో స్లో ఓవర్ రేటు కారణంగా టీమిండియా ప్లేయర్లకు 10 శాతం మ్యాచ్ ఫీజులో కోత పడింది. ఐసీసీ రూల్స్ ఆర్టికల్ 2.22 ప్రకారం, ఈ కోతను విధించారు. 

Also Read: India Vs South Africa: చేతులేత్తిసిన బ్యాట్స్‌మెన్.. తొలి టెస్టులో టీమిండియా చిత్తు

భారత జట్టు ఇదే(రెండో టెస్టు): 
రోహిత్ శ‌ర్మ్‌(కెప్టెన్), శుభ‌మ‌న్ గిల్‌, జైస్వాల్‌, కోహ్లీ, శ్రేయాస్ అయ్య‌ర్, కేఎల్ రాహుల్, అశ్విన్‌, జ‌డేజా, శార్దూల్‌, సిరాజ్‌, ముకేశ్‌, బుమ్రా, ప్ర‌సిద్ధ కృష్ణ‌, కేఎస్ భ‌ర‌త్‌, అభిమ‌న్యు ఈశ్వ‌ర‌న్‌, అవేశ్ ఖాన్.

Also Read: Team India: సఫారీ దెబ్బకు టాప్ ఫ్లేస్ కోల్పోయిన భారత్.. ఏకంగా ఎన్ని స్థానాలు దిగజారిందంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News