India Vs England final T20 Match: ఇప్పటికే ట్వంటీ సిరీస్‌ను సొంతం చేసుకున్నా బ్యాటింగ్‌లో మాత్రం టీమ్ ఇండియా తడబాటు కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్‌లపైనే అందరి దృష్టి ఉంది. పరుగుల బాటలో వెనుకబడ్డ వీళ్లు.. ఫామ్‌ను అందుకోవాల్సివుంది. సంజు ఓపెనర్‌గా నాలుగు మ్యాచ్‌ల్లో 35 పరుగులు మాత్రమే చేశాడు. అయినా సరే ఓపెనింగ్‌లో టీమ్‌ఇండియా మార్పులు చేసే అవకాశం ఏ మాత్రం లేదు. ఇక సూర్యకుమార్ ఫామ్ అంతగా లేదు. ఎనిమిది మ్యాచ్‌ల క్రితం బంగ్లాదేశ్‌పై 75 పరుగులు చేశాక, అతడు మరో బిగ్ ఇన్నింగ్స్ ఆడలేదు. ఈ సిరీస్‌లో రెండు సార్లు డకౌటైన సూర్య మొత్తం 26 పరుగులు మాత్రమే చేశాడు.
ఓపెనర్ అభిషేక్ శర్మ బాగానే ఆడుతున్నాడు. రింకు గత మ్యాచ్‌లో రాణించడతో తన ఫామ్, ఫిట్‌నెస్‌పై వ్యక్తమవుతున్న ఆందోళనను పోగొట్టాడు. హార్దిక్ పాండ్య, శివమ్ దూబెల ఫామ్ భారత్‌కు కలిసి వచ్చే అంశం. వీరు అర్ధశతకాలతో నాలుగో టీ20లో టీమ్‌ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించారు. అయితే కంకషన్ కారణంగా దూబె ఆడడం అనుమానమే. ఆఖరి మ్యాచ్‌కు షమి జట్టులోకి వచ్చే అవకాశముంది. వరుణ్ సహా స్పిన్నర్ల ఫామ్ భారత్‌కు కలిసొచ్చే విషయం.
ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?
ఇదీ చదవండి: గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!
ఇక ఇంగ్లాండ్ ఈ మ్యాచ్‌లో గెలిచి గౌరవంగా సిరీస్‌ను ముగించాలనుకుంటోంది. ఆ జట్టు బ్యాటింగ్‌లో పుంజుకోవాల్సివుంది. వరుణ్ చక్రవర్తి, ఇతర భారత స్పిన్నర్లను ఎదుర్కోవడంలో తడబాటును ఇంగ్లాండ్ అధిగమించగలదా అన్నది ప్రశ్న. ఆ జట్టు బట్లర్, డకెట్, బ్రూక్, ఒవర్టన్, రషీద్‌లపై ఎక్కువ ఆశలు పెట్టుకుంది. వాంఖడే స్టేడియంలో పిచ్ ఎప్పుడూ బ్యాటింగ్‌కే అనుకూలం.ఎవరు ముందు బ్యాటింగ్ చేస్తే వారికీ పరుగుల వరద ఖాయం. ఆరంభంలో పేసర్లకు, తర్వాత స్పిన్నర్లకు సహకారం లభిస్తుంది. టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏది ఏమైనా ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారనేది అంత ఉత్కంఠ రేపకపోయినా.. ప్రేక్షకుల్లో ఓ మాత్రం ఓ రకమైన ఆసక్తి నెలకొంది ఈ మ్యాచ్ పై.
ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.