IPL 2022 CSK VS LSG: చెన్నై X లక్నో.. తొలి విజయాన్ని నమోదు చేసేది ఎవరు?

IPL 2022 CSK VS LSG: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో గురువారం చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. టోర్నీలోని తమ తొలి మ్యాచుల్లో ఓడిన ఇరు జట్లు.. తమ తొలి విజయాన్ని నమోదు చేసుకోవాలని తహతహలాడుతున్నాయి. ఈ మ్యాచ్ గురువారం (మార్చి 31) రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 31, 2022, 09:04 AM IST
IPL 2022 CSK VS LSG: చెన్నై X లక్నో.. తొలి విజయాన్ని నమోదు చేసేది ఎవరు?

IPL 2022 CSK VS LSG: ఇండియన్ ప్రీమియర్ లీగ్ మరో ఆసక్తికర మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. ఐపీఎల్ లో గురువారం జరగనున్న మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. ఈ టీమ్స్ తాము ఆడిన తొలి మ్యాచ్ లో ఓటమి పాలయ్యారు. దానికి ప్రధానకారణం బ్యాటింగ్ విఫలమే! గతేడాది టోర్నీ విజేతగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ఈ మ్యాచ్ లో ఫేవరేట్ గా బరిలో దిగింది. ఈ మ్యాచ్ గురువారం రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. 

ఈ మ్యాచ్ అయినా విజయం సాధిస్తారా?

ఇదే ఏడాది ఐపీఎల్ లో ఎంట్రీ ఇచ్చిన జట్టు లక్నో సూపర్ జెయింట్స్. టోర్నీలో ఆడిన తొలి మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ పై ఓటమి పాలైన ఈ జట్టు.. ఎలాగైనా తొలి విజయాన్ని నమోదు చేసుకోవాలని తహతహలాడుతుంది. గత మ్యాచ్ లో కెప్టెన్ కేఎల్ రాహుల్ సహా ఓపెనర్ క్వింటన్ డికాక్ బ్యాటింగ్ లో విఫలమయ్యారు. బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ విఫలమైన కారణంగా గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. 

దీపక్ హుడా, ఆయుష్ బదోని గత మ్యాచ్ లో ఫర్వాలేదనిపించారు. బౌలింగ్ దళంలో పేసర్ చమీరా, ఆవేశ్ ఖాన్ ఆకట్టుకునే ప్రదర్శన చేశారు. స్పిన్నర్లు రవి బిష్ణోయ్, హుడా, కృనాల్‌ పాండ్యా కూడా తమదైన శైలిలో జట్టుకు అండగా నిలవాల్సిన అవసరం ఉంది. 

సూపర్ ఫామ్ లోకి వస్తుందా?

ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో గతేడాది విజేతగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్.. ఈసారి కూడా ట్రోఫీని ముద్దాడాలను ఊవిళ్లూరుతుంది. అయితే ఈ సీజన్ లో రవీంద్ర జడేజా కెప్టెన్సీలో ఆడిన తొలి మ్యాచ్ లో సీఎస్కే, కోల్ కతా నైట్ రైడర్స్ తో తలపడింది. ఈ మ్యాచ్ లో చెన్నె జట్టు ఓడినా.. రెండో మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధిస్తామని సీఎస్కే టీమ్ ధీమాగా ఉంది.  

రుతురాజ్ గైక్వాడ్, రాబిన్ ఉతప్ప, డెవాన్ కాన్వే, అంబటి రాయుడుతో పాటు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీతో బ్యాటింగ్ లైనప్ బలంగానే ఉంది. కానీ, గత మ్యాచ్ లో టాప్ ఆర్డర్ బ్యాటర్లు విఫలమవ్వడం వల్ల ఓటమి ఎదురైంది. ఆల్ రౌండర్ల రవీంద్ర జడేజా, శివమ్ దుబే గత మ్యాచ్ ప్రదర్శన ఫర్వాలేదనిపించింది. మరోవైపు బౌలింగ్ దళంలో బ్రావో, మొయిన్ అలీ సహా ఇతర బౌలర్లు రాణించాల్సిన అవసరం ఉంది. 

టీమ్స్ (అంచనా):

లక్నో సూపర్ జెయింట్స్ టీమ్:

కేఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్) ఎవిన్ లూయిస్, మనీష్ పాండే, దీపక్ హుడా, క్రునాల్ పాండ్యా, మోసిన్ ఖానా, ఆయుష్ బదోని, దుష్మంత్ చమీరా, రవి బిష్ణోయ్, ఆవేశ్ ఖాన్. 

చెన్నై సూపర్ కింగ్స్:

రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా (కెప్టెన్), శివమ్ దూబే, ఎంఎస్ ధోనీ (వికెట్ కీపర్), డ్వేన్ బ్రావో, మిచెల్ శాంటర్న్, ఆడమ్ మిల్నే, తుషార్ దేష్ పాండే.  

Also Read: RCB vs KKR: స్వల్ప స్కోర్‌కే చాప చుట్టేసిన కోల్‌కతా.. లక్ష్య చేధనలో తడబడుతున్న బెంగళూరు..

Also Read: IPL 2022: చెన్నై సూపర్‌ కింగ్స్‌ Vs లక్నోసూపర్‌ జెయింట్స్‌.. బోణి కొట్టేదెవరు..??

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News