MI vs DC Match IPL 2020 Final | ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020)లో నేడు అసలు సిసలైన పోరు జరగనుంది. టైటిల్ విజేతను నిర్ణయించే ఫైనల్ మ్యాచ్‌కు దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం వేదికగా మారనుంది. ఓవైపు 5 ఐపీఎల్ ఫైనల్స్ ఆడిన ముంబై ఇండియన్స్ (Mumbai Indians) జట్టుతో తొలి ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) తలపడేందుకు సిద్ధమైంది. అయితే ఢిల్లీ తొలిసారి ఫైనల్ ఆడుతుందని ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) తేలికగా తీసుకోలేదు. భారత క్రికెటర్, ఆఫ్ స్పిన్నర్‌ను బరిలోకి దింపేందుకు సిద్ధంగా ఉంది.
IPL 2020 Final: ఎంఎస్ ధోనీ ఉంటే రోహిత్‌దే విజయం.. కానీ ఈ ఫైనల్ సంగతేంటి!
టైటిల్ సాధించాలంటే తుది మెట్టుపై సైతం జాగ్రత్త పడాలని రోహిత్ భావిస్తున్నాన్నాడు. ఈ నేపథ్యంలో ఢిల్లీ జట్టుకు వెన్నెముకగా మారిన లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ పని పట్టేందుకు రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ భారీ వ్యూహాన్ని రచించింది. ఫైనల్లో ఆల్ రౌండర్ క్రికెటర్, ఆఫ్ స్పిన్నర్ జయంత్ యాదవ్‌కు తమ జట్టు అవకాశం ఇస్తుందని ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. దీనికి కారణం ఢిల్లీ జట్టులో ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ అయిన శిఖర్ ధావన్, షిమ్రోన్ హిట్మెయిర్, రిషబ్ పంత్, అక్షర్ పటేల్ ఉన్నారు, వీరంతా హార్డ్ హిట్టర్లు. పైగా ఐపీఎల్ తాజా సీజన్లో రాణించిన ఆటగాళ్లు. వీరికి చెక్ పెట్టేందుకు ఆఫ్ బ్రేక్ బౌలర్ జయంత్ యాదవ్‌కు కీలక మ్యాచ్‌లో అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలిపాడు.
Rohit sharma Selected for Australia Tour: టీమిండియా నుంచి రోహిత్ శర్మకు పిలుపు.. కానీ ఒక్క ఛాన్స్!
‘గతంలో అతడు ఢిల్లీ జట్టు తరఫున ఆడాడు. ఈ సీజన్లో లీగ్ దశలో ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశాడు. అందుకే అతడికి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నాం. తుది జట్టులోకి అతడ్ని ఎంపిక చేయడం సరైన నిర్ణయం. ఆ మ్యాచ్‌లో వికెట్లు తీయనప్పటికీ జయంత్ యాదవ్ ఢిల్లీ ఆటగాళ్లను నిలువరించాడు. అయితే ఫైనల్ మ్యాచ్‌లో మాకు ఇది కలిసొస్తుందని’ రోహిత్ శర్మ తమ వ్యూహాన్ని షేర్ చేసుకున్నాడు.
IPL 2020: హైదరాబాద్‌ను ఓడించి తొలిసారి ఫైనల్‌కు చేరిన ఢిల్లీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe