P.V Sindhu Defeat: పారిస్ ఒలింపిక్స్‌లో 5వ రోజు భారత్ ఏ పతకాన్ని సాధించలేదు. కానీ ఆరో రోజు స్వప్నిల్ కుసాలే కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. బ్యాడ్మింటన్‌లో 16వ రౌండ్‌లో లక్ష్యసేన్ హెచ్‌ఎస్ ప్రణయ్‌పై విజయం సాధించాడు. తాజాగా ప్రిక్వార్టర్‌ఫైనల్ మ్యాచ్‌లో చైనా క్రీడాకారిణి హె బింగ్ జియావో చేతిలో పీవీ సింధు ఓటమి పాలయ్యింది. 19-21, 14-21 తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. మ్యాచ్ ప్రారంభంలో హె బిన్ జియావో మొదటి గేమ్‌లో ముందంజలో ఉంది. తర్వాత పీవీ సింధు ఆధిక్యాన్ని సమం చేసింది. చివరిలో ఇద్దరికి సమాన పాయింట్లు వచ్చాయి. కానీ చివరికి చైనా క్రీడాకారిణి 21-19తో గేమ్‌ను గెలుచుకుని మ్యాచ్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. అటు నిఖత్ జరీన్ కూడా బాక్సింగ్‌లో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. వీరిపై భారత్ పతక ఆశలు పెట్టుకుంది.
Also Read: Health Tips: ఉదయం బ్రేక్ ఫాస్టులో ఈ పండ్లు తింటే చాలు..మందులతో పనే ఉండదు..!!
పీవీ సింధు ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించింది. రియో ఒలింపిక్స్ 2016లో రజత పతకాన్ని, టోక్యో ఒలింపిక్స్ 2020లో కాంస్య పతకాన్ని గెలుచుకుంది. టోక్యోలో చైనాకు చెందిన హి బింగ్ జియావోను ఓడించి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. కానీ బింగ్ జియావో ఇప్పుడు సింధు ను ఓడించి పతకాన్ని కైవసం చేసుకుంది. సింధు పారిస్ ఒలింపిక్స్‌లో పతకం సాధిస్తే ఒలింపిక్స్ చరిత్రలో వరుసగా మూడు పతకాలు సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా రికార్డుల్లోకి ఎక్కేది. కానీ అది జరగలేదు. సింధు పోరాడి ఓడింది.
హీ బింగ్ జియావోతో పీవీ సింధు మ్యాచ్ 56 నిమిషాల పాటు సాగింది. జియావోపై 21 మ్యాచ్‌ల్లో ఇది 12వ ఓటమి. ఈ మ్యాచ్‌లో సింధుకు శుభారంభం దక్కలేదు. సింధు కొన్ని అనవసరమైన తప్పిదాలు చేసింది. అయితే జియావో కొన్ని ఖచ్చితమైన స్మాష్‌లను కొట్టింది. చైనా క్రీడాకారిణికి 7-2 ఆధిక్యంలోకి వచ్చే అవకాశం ఇచ్చింది.కానీ సింధు పాయింట్లు పెంచుకుంటే పునరాగమనం చేసే ప్రయత్నం చేసింది. ఒకానొక సమయంలో చైనా క్రీడాకారిణికి చుక్కలు చూపించింది సింధు.
19-19 వద్ద ప్రత్యర్థి క్రీడాకారిణి దూకుడుగా ఆడింది. దీంతో తొలిసెట్లో ఆమె గెలిచింది. రెండో సెట్లో ప్రారంభం నుంచి చైనా క్రీడాకారిణి ఆధిపత్యం ప్రదర్శించింది. 16-9 తేడాతో వెనకబడింది. ఆ తర్వాత సింధు దూకుడును ప్రదర్శించలేకపోయింది. అదే లీడింగ్ తో దూసుకొచ్చిన బింగ్ జియావో విజయం సాధించింది.
MASSIVE SETBACK IN BADMINTON FOR INDIA!🏸
P.V. Sindhu is eliminated from the Paris 2024 Olympics after a defeat to China’s He Bing Jiao.❌ pic.twitter.com/hoNtdI7n7t
— Yogesh Tambare (@TambareYogesh) August 1, 2024
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook