YS Avinash Reddy's pressmeet: పులివెందుల పర్యటనలో భాగంగా మాజీ సీఎం చంద్రబాబు నాయుడు నిన్న పులివెందులలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన వ్యాఖ్యలను కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఖండించారు. వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నన్ను నా కుటుంబాన్ని సర్వనాశనం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు.
Chandrababu Pulivendula Tour: రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరాన్ని సిఎం జగన్ నాశనం చేశారని.. రివర్స్ టెండరింగ్ వల్ల ఇప్పుడు రాష్ట్రమే రివర్స్ లో ఉంది అని ఆవేదన వ్యక్తంచేశారు. కేంద్రం మనకు ఇచ్చిన వరం పోలవరం. నేను పట్టుకుంటే ఉడుము పట్టే. రాయలసీమలో ప్రతి ఎకరాకు నీరిచ్చే బాధ్యత నాది అంటూ భారీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబుపైనా విమర్శలు చేశారు.
Chandrababu Naidu Supports to Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌పై కేసు నమోదు చేయడంపై చంద్రబాబు నాయుడు స్పందించారు. రాజకీయ పక్షాలు ప్రశ్నిస్తే కేసులు అనేది ఈ రాక్షస ప్రభుత్వ విధానమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అణచివేత ధోరణి మానుకోవాలన్నారు.
CM Jagan Comments On Pawan Kalyan And Chandrababu: పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడులపై సీఎం జగన్ సెటైరికల్ కామెంట్స్ చేశారు. ఒకరు వెన్నుపోటు వీరుడు అని.. మరొకరుడు ప్యాకేజీ శూరుడు అని కౌంటర్ ఇచ్చారు. ఇద్దరు కలిసి ప్రజలను మోసం చేస్తూ 2014-2019 మధ్య రాష్ట్రాన్ని పాలించారని అన్నారు.
Chandrababu Naidu on Jagananna Amma Vodi Scheme: అమ్మ ఒడి పథకం కింద సీఎం జగన్ మోహన్ రెడ్డి విద్యార్థుల తల్లుల ఖాతాలోకి రూ.13 వేలు జమ చేసిన విషయం తెలిసిందే. అయితే రూ.2 వేలు కోత విధిడంపై చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. సవాలక్ష కారణాలతో కోతల రాయుడు కోర్రీలు పెడుతున్నాడని కౌంటర్ ఇచ్చారు.
Ambati Rambabu Pawan Kalyan: పవన్ కళ్యాణ్ మనసు ఒక్కో పర్యటనకు ఒక్కో రకంగా మారుతోంది అని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ కి రాజకీయాలు అంటే ఏంటో తెలీదు.. పవన్ కళ్యాణ్ అసలు రాజకీయాలకు పనికిరాడు అని అంబటి రాంబాబు తేల్చేశారు.
AP Assembly Elections 2023: ఏపీలో తెలుగు దేశం పార్టీ విజయానికి తెలుగు తమ్ముళ్లే అడ్డం పడుతున్నారా ? పార్టీ బలోపేతానికి కృషి చేయాల్సిన వాళ్లే.. పార్టీని దెబ్బ తీస్తున్నారా ? అసలు వచ్చే ఎన్నికల్లో టీడీపీ పరిస్థితి ఏంటి ? టీడీపీని ఇబ్బంది పెడుతున్న అంశాలు ఏంటి ?
AP Assembly Election 2023 Dates News: ఏపీలో ముందస్తు ఎన్నికల సందడి కనిపిస్తోంది. జూన్ 7న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేబినెట్ భేటీ ఏర్పాటు చేశారు. ఇందులో ముందస్తు ఎన్నికలకు సంబంధించి కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని.. అందుకే ఈ కేబినెట్ భేటీని ఏర్పాటు చేసి ఉంటారేమోనని జోరుగా ప్రచారం జరుగుతోంది.
Eggs Pelted at Nara Lokesh: పోలీసులపై నారా లోకేష్ సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నారా లోకేష్‌పై కోడి గుడ్లతో దాడికి పాల్పడిన వ్యక్తిపై టిడిపి కార్యకర్తలు దాడి చేస్తుండగా.. వారి నుండి పోలీసులు ఆ వ్యక్తిని రక్షించి అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
TDP Manifesto: రాజమండ్రిలో జరిగిన మహానాడు వేదికగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. మరోవైపు ఆరు ప్రధాన అంశాలతో మేనిఫెస్టో విడుదల చేశారు. ఈ ఉచితాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపైనే ఆ పార్టీ సామర్ధ్యం ఆధారపడి ఉంది.
YS Vivekananda Reddy's Murder Case: రాజమండ్రి: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ దాఖలు చేసిన అఫిడవిట్ని ఉటంకిస్తూ టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
TDP Mahanadu In Rajahmundry: ఒక్క ఛాన్స్ అంటూ.. ముద్దులు పెట్టి అధికారంలో వచ్చిన జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని నాశనం చేశాడని మండిపడ్డారు చంద్రబాబు నాయుడు. అమ్మ ఒడి నాటకం, నాన్నబుడ్డి వాస్తవమని సెటైర్లు వేశారు.. మద్యపాన నిషేధం అని హామీనిచ్చి మద్యాన్ని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకుంటున్నారని ఫైర్ అయ్యారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.