Watch Cheetah Roaming In Shamshabad Airport: పలు ప్రాంతాల్లో చిరుతల సంచారం తెలంగాణ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. కొన్ని ప్రాంతాల్లో జనావాసాల మధ్యకు వచ్చి మనుషులపై దాడి చేసి ప్రాణాలు తీస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ శివారులోని శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో చిరుత సంచారం కలకలం సృష్టిస్తోంది.
Leopard in Ghaziabad | అడవుల విస్తీర్ణం తగ్గుతుండటంతో మూగజీవాలు బస్తీబాట పట్టాయి. అడవుల్లో సంచరించడానికి వాటికి సరైనా చోటు లేకపోవడంతో వీధుల్లోకి వస్తున్నాయి. తాజాగా అలాంటి ఒక ఘటన ఉత్తర భారతదేశంలోని ఘాజియాబాద్ లో జరిగింది.
తెలంగాణ రాజధాని హైదరాబాద్ శివార్లల్లో గత కొంతకాలంగా అందరినీ భయభ్రాంతులకు గురిచేస్తున్న చిరుత ఎట్టకేలకు పట్టుబడింది. రాజేంద్రనగర్లోని వాలంతరి దగ్దర అటవీ అధికారులు ఏర్పాటుచేసిన బోనులో ఆదివారం తెల్లవారుజామున చిక్కింది.
మహారాష్ట్ర ( Maharashtra ) లోని అటవీ ప్రాంతంలోని ఓ గుడిసెలో చిరుతపులి నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. జనావాసాలకు దగ్గరలో ఆడ చిరుత ( Leopardess ) పిల్లలకు జన్మనివ్వడంతో ఆ ప్రాంతవాసులు ఆందోళన చెందుతున్నారు.
వలకు చిక్కిన చిరుతపులి ( Leopard trapped in net ) చిక్కినట్టే చిక్కి తప్పించుకుని.. దానిని పట్టుకోవడానికి వచ్చిన అటవీ శాఖ సిబ్బందిని ( Forest range ) ముప్పుతిప్పలు పెట్టింది. మర్రిగూడ మండలం రాజాపేట తండా శివారులో గురువారం చోటుచేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. అక్కడ గ్రామస్తులు వేసిన ఉచ్చులో ఓ చిరుత పులి చిక్కుకుంది. ఉచ్చుకు చిరుతపులి చిక్కడం గమనించిన గ్రామస్తులు ఫారెస్ట్ అధికారులు, పోలీసులకు సమాచారం అందించారు.
'కరోనా వైరస్' కారణంగా లాక్ డౌన్ విధించడంతో జనం ఇళ్లకు పరిమితమయ్యారు. దీంతో జంతువులు అటవీ ప్రాంతాల నుంచి జనావాసాల్లోకి వస్తున్నాయి. మొన్నటికి మొన్న హైదరాబాద్లో నడి రోడ్డుపై చిరుత దర్శనమిచ్చింది.
హైదరాబాద్లో నడిరోడ్డుపై చిరుత కలకలం సృష్టించింది. రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కాటేదాన్ లో చిరుత కనిపించింది. ఉదయంపూట రోడ్డుపై చిరుత పడుకుని ఉండడాన్ని స్థానిక ప్రజలు గమనించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. ప్రస్తుతం అక్కడ సోషల్ మీడియాలో చిరుత తిరుగుతున్న విజువల్స్ వైరల్ అవుతున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు ఏ మూల నుంచి చిరుత పులి దాడి చేస్తుందోనని భయాందోళన చెందుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.