ఓంకార్ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున ప్రత్యేక పాత్రలో నటిస్తున్న సినిమా ‘రాజుగారి గది 2’. మలయాళ సినిమా ‘ప్రేతమ్’ ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. ఇటీవలే ఈ చిత్ర నిర్మాతలు సినీ ప్రమోషన్లో భాగంగా ఓ పోస్టరును విడుదల చేశారు. ఈ పోస్టరులో సమంత టీచర్ గెటప్‌లో కనువిందు చేస్తూ .. క్లాస్ రూములో విద్యార్థుల ముందు బెత్తంతో నవ్వుతూ కనిపించడం కొసమెరుపు. తెల్ల పంచె, లాల్చీతో ఉన్న ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అయితే ఈ చిత్రంలో సమంత పాత్ర ఏమిటి అన్న విషయంలో ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. అక్టోబరు 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.