Maruti Swift Hybrid: కొత్త స్విఫ్ట్ హైబ్రిడ్ వచ్చేసిందోచ్..పిచ్చెక్కించే ఫీచర్స్...అద్భుతమైన మైలేజ్

Maruti Swift Hybrid: ప్రముఖ కార్ల తయారీదారు కంపెనీ మారుతి సుజుకి ఇండియా కొత్త స్విఫ్ట్ నెంబర్ 1 హ్యాచ్ బ్యాక్ గా మారింది. గత రెండు నెలలుగా హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్లో అగ్రస్థానంలో నిలిచింది. కంపెనీ దాని అమ్మకాలను పెంచుకునేందుకు ఈ కారు హైబ్రిడ్ వేరియంట్ ను టెస్టింగ్ చేయడం షురూ చేసింది.

Written by - Bhoomi | Last Updated : Nov 22, 2024, 09:10 PM IST
 Maruti Swift Hybrid: కొత్త స్విఫ్ట్ హైబ్రిడ్ వచ్చేసిందోచ్..పిచ్చెక్కించే ఫీచర్స్...అద్భుతమైన మైలేజ్

Maruti Swift Hybrid:  4వ జనరేషన్ స్విటెస్ట్ మ్యూల్ బెంగళూరులో టెస్ట్ చేస్తున్నట్లు ఫొటోలు లీక్ అయ్యాయి. దాని టెయిల్ గేట్ పై హైబ్రిడ్ బ్యాడ్జ్ ఉంది. ఈ హైబ్రిడ్ వేరియంట్ మైలేజీ స్విఫ్ట్ అన్ని వేరియంట్స్ కంటే ఎక్కువగా ఉంటుంది. 

 కొత్త స్విఫ్ట్లో 1.2 లీటర్ 3 సిలిండర్ Z సిరీస్ ఇంజిన్ ఉంటుంది. ఈ ఇంజిన్ మునపటి K సిరీజ్ 1.2 లీటర్ 4 సిలిండర్ ఇంజన్ కంటే మెరుగైన మైలేజీని ఇస్తుందని కంపెనీ వెల్లడించింది. కంపెనీ న్యూ డిజైర్ లో కూడా అదే ఇంజిన్ ను ఉపయోగించింది. ఇది మాత్రమే కాదు సీఎన్జీ సెటప్ తో కూడా దీని మైలేజీ అద్భుతంగా ఉంది. అయితే ఈ ఇంజన్ హైబ్రిడ్ సెటప్ ఇండియాలో అందుబాటులో లేదు. ఇది ఇంటర్నెషనల్ మార్కెట్లో అందిస్తుంది. హైబ్రిడ్ ఇంజన్ త స్విఫ్ట్ లీటర్ పెట్రోల్లో 40 కి.మీ మైలేజీ వరకు ఇస్తుంది. 

హైబ్రిడ్ బ్యాడ్జ్ తో కొత్త స్విఫ్ట్ టెస్టింగ్  ఈ హ్యాచ్ బ్యాక్ హైబ్రిడ్ సెటప్ తో వస్తుంది. అయితే కంపెనీ కూడా అధికారికంగా ఇంకా ఎలాంటి వివరాలను ప్రకటించలేదు. అంతర్జాతీయ మార్కెట్లో స్విఫ్ట్ హైబ్రిడ్ 1.2 లీటర్ Z సిరీస్ 3 సిలిండర్ ఇంజన్ ఆధారంగా తేలికపాటి హైబ్రిడ్ సెటప్ తో విక్రయించింది. ఈ మైల్డ్ హైబ్రిడ్ వెర్షన్ ప్రపంచ స్థాయిలో 82 బీహెచ్ పీ పవర్ అందిస్తుంది. అదే గరిష్ట టార్క్ 112 Nm.CVT ఆటోమేటిక్ గేర్ బాక్స్ గ్లోబల్ మోడల్ లో అందుబాటులో ఉంది. AMT ఇండియాలో అందుబాటులో ఉంది. 

కొత్త జెన్ స్విఫ్ట్ డిజైన్, ఫీచర్లు,స్పెసిఫికేషన్‌లు:

ఇందులో కొత్తగా డిజైన్ చేసిన డ్యాష్‌బోర్డ్ అందుబాటులో ఉంది. ఈ స్క్రీన్ వైర్‌లెస్ కనెక్టివిటీతో Android Auto, Apple CarPlayకి మద్దతు ఇస్తుంది. బాలెనో, గ్రాండ్ విటారా వలే ఆటో క్లైమేట్ కంట్రోల్ ప్యానెల్‌తో సెంటర్ కన్సోల్ రీడిజైన్ చేశారు. ఇది కొత్త LED ఫాగ్ ల్యాంప్‌ను పొందుతుంది. కంపెనీ దీనిని LXi, VXi, VXi (O), ZXi, ZXi+,  ZXi+ డ్యూయల్ టోన్ అనే 6 వేరియంట్‌లలో పరిచయం చేసింది.

ఇది చదవండి: Ram Charan: ముదురుతున్న రామ్ చరణ్ దర్గా వివాదం.. క్షమాపణకు అయ్యప్ప స్వాములు డిమాండ్

పూర్తిగా కొత్త ఇంటీరియర్ ఇందులో కనిపించనుంది. దీని క్యాబిన్ చాలా విలాసవంతమైనది. వెనుక ఏసీ వెంట్స్ ఇందులో అందుబాటులో ఉన్నాయి. ఈ కారులో వైర్‌లెస్ ఛార్జర్, డ్యూయల్ ఛార్జింగ్ పోర్ట్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇది వెనుక వీక్షణ కెమెరాను కలిగి ఉంటుంది. తద్వారా డ్రైవర్ కారును సులభంగా పార్క్ చేయవచ్చు. ఇది 9-అంగుళాల ఫ్రీ-స్టాండింగ్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌ను కలిగి ఉంది.

కొత్త స్విఫ్ట్ . భద్రతా లక్షణాల గురించి తెలుసుకుంటే.. ఇది హిల్ హోల్డ్ కంట్రోల్, ESP, కొత్త సస్పెన్షన్ , అన్ని వేరియంట్‌లకు 6 ఎయిర్‌బ్యాగ్‌లను పొందుతుంది. ఇది క్రూయిజ్ కంట్రోల్, అన్ని సీట్లకు 3-పాయింట్ సీట్‌బెల్ట్‌లు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (EBD), బ్రేక్ అసిస్ట్ (BA) వంటి అద్భుతమైన భద్రతా లక్షణాలను కలిగి ఉంది.

ఇది చదవండి: Street Dog: ముఖ్యమంత్రి, మంత్రులను భయపెట్టిన 'కుక్క'... హెలికాప్టర్‌ ఆలస్యం?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News