Bandi Sanjay Vs Rahul: ఏ మొహం పెట్టుకుని వస్తున్నవ్..?.. రాహుల్ గాంధీని ఏకీపారేసిన కేంద్ర మంత్రి..

Bandi sanjay hot comments on Rahul gandhi: తెలంగాణలో పర్యటనకు వస్తున్న రాహుల్ గాంధీకి 6 గ్యారంటీల మీద మాట్లాడే దమ్ముందా అంటూ ఫైర్ అయ్యారు. అదే విధంగా తెలంగాణలో ప్రస్తుతం ఆలయాల వరుస దాడుల  ఘటనపై కూడా మండిపడ్డారు.  

Written by - Inamdar Paresh | Last Updated : Nov 5, 2024, 02:48 PM IST
  • రాహుల్ గాంధీపై మండిపడిన కేంద్ర మంత్రి..
  • ఇప్పటికైన బీఆర్ఎస్ నేతలు మారాలని చురకలు..
Bandi Sanjay Vs Rahul: ఏ మొహం పెట్టుకుని వస్తున్నవ్..?.. రాహుల్ గాంధీని ఏకీపారేసిన కేంద్ర మంత్రి..

Bandi Sanjay fires on mp Rahul Gandhi: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రస్తుతం తెలంగాణలో రావడంపై రాజకీయాల్లో ఒక్కసారిగా రచ్చగా మారిందని చెప్పుకొవచ్చు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ దీనిపై ఫైర్ అయ్యారు. తెలంగాణకు వస్తున్నకాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి ఆరు గ్యారంటీల మీద మాట్లాడే దమ్ముందా అని మండిపడ్డారు. అంతే కాకుండా.. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అమలు కానీ హమీలను చెప్పి మరీ కర్ణాటక, తెలంగాణలో అధికారంలోకి వచ్చిందని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ సర్కారు..గొప్పలు చేప్పుకుంటూ.. మహారాష్ట్రలో అన్ని పేపర్లకు యాడ్స్ ఇచ్చుకొవడం సిగ్గు చేటని మండిపడ్డారు. గతంలో కేసీఆర్ ఇట్లనే తెలంగాణ సొమ్మును మహారాష్ట్ర, పంజాబ్ లకు పంచారని... కాంగ్రెస్ నేతలు ఆయనను వెనక్కునేట్టి మరీ ముందుకు వెళ్లిపోయారన్నారు.  

ఈ క్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్.. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలోని రుద్రంగి మండల కేంద్రంలో.. రూ.22 లక్షల విలువైన ఎంపీ లాడ్స్, ఉపాధి హమీ నిధులతో వివిధ డెవ్ లప్ మెంట్ పనులకు శంకు స్థాపనలు చేశారు. ఈ క్రమంలో వంద రోజల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని కాంగ్రెస్ చెప్పిందని, దాని మీద మాట్లాడే దమ్ముందా అంటూ మండిపడ్డారు. మూసీని ప్రక్షాళన అంటూ పేదల్ని దోచచుకొవడం మానుకొవాలన్నారు.

Read more:  Hyderabad: శంషాబాద్‌లో ఆంజనేయ స్వామి గుడిపై దాడి.. రంగంలోకి దిగిన హిందు సంఘాలు..

కాంగ్రెస్ సర్కారు.. 15 వేల కోట్లతో ఖర్చయ్యే ప్రాజెక్టుల కోసం.. లక్షన్నర కోట్లకు పెంచి కమీషన్లు దండుకోవడం వంటి పనులకు తాము వ్యతిరేకమన్నారు. ఇప్పటికే తెలంగాణ అప్పుల్లొ కూరుకుపోయిందని  గంటకు 3 కోట్ల మిత్తి కట్టాల్సి వస్తోందని మీ మంత్రులు చెబుతున్నారని బండి సంజయ్ సీఎం రేవంత్ కు చురకలంటించారు. అదే విధంగా రాహుల్ గాంధీ అశోక్ నగర్ కు వెళ్లి నిరుద్యోగుల్ని కలుస్తారని కూడా వార్తలు వస్తున్నాయి. మొత్తానికి తెలంగాణ రాహుల్ పర్యటన నేపథ్యంలో మాత్రం ఒక్కసారిగా హీట్ వాతావరణం నెలకొందని చెప్పుకొవచ్చు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News