Telangana TET 2024: టెట్ -2024 పరీక్ష ఫీజులను తగ్గించాలి.. సీఎం రేవంత్ కు లేఖ రాసిన మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్..

Telangana TET 2024: తెలంగాణలో టీచర్ ఎలిజిబిలీటి టెస్ట్ కు విద్యాశాఖ ఫీజులను భారీగా పెంచిందని మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ ఆరోపించారు. తమ హాయాంలో టెట్ ఎగ్జామ్ కు ఒక పేపర్ రాస్తే 200ల ఫీజు, రెండు రాసిన వారికి 300 ఫీజు తీసుకున్నట్లు మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ గుర్తు చేశారు.  

Last Updated : Mar 23, 2024, 06:55 PM IST
  • టెట్ అభ్యర్థులకు న్యాయంచేయాలన్న మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్..
  • ఎగ్జామ్ సెంటర్లను పెంచాలని డిమాండ్..
Telangana TET 2024: టెట్ -2024 పరీక్ష ఫీజులను తగ్గించాలి.. సీఎం రేవంత్ కు లేఖ రాసిన మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్..

Farmer MLA Balka Sumar Writes Letter TO CM Revanth Reddy Over TET Fees: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్-2024 పరీక్ష ఫీజులను విద్యాశాఖ భారీగా పెంచింది. ప్రస్తుతం ఈ ఎగ్జామ్ కు రాయాలనుకునే అభ్యర్థులు..టెట్ పరీక్ష ఫీజు ఒక పేపర్‌కు 1000, రెండు పేపర్లకు 2000 రూపాయాలను చెల్లించాలని సూచించింది. ఇదిలా ఉండగా.. దీనిపై మాజీ ప్రభుత్వ విప్, చెన్నూరు మాజీ శాసనసభ్యులు, బాల్క సుమన్  తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనేప్రభుత్వం చోరవ తీసుకుని ఫీజులను తగ్గించాలని కోరారు.

Read More: Married Women Demands: డైలీ చుక్క, ముక్క ఉంటేనే కాపురం.. భార్య డిమాండ్లకు షాకైన భర్త..

అంతేకాకుండా.. గత ప్రభుత్వంలో ఒక పేపర్ రాస్తే 200ల ఫీజు, రెండు రాసిన వారికి 300 ఫీజు తీసుకున్నట్లు గుర్తు చేశారు. ఫీజులను విద్యాశాఖ భారీగా పెంచడంతో ఎందరో పేద విద్యార్థులు ఫీజులు కట్టలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. టెట్ ఎగ్జామ్ ఫీజులపై వెంటనే ఒక నిర్ణయం తీసుకొవాలని, పేదలకు భారంగా మారిన టెట్ ఫీజులను వెంటనే తగ్గించాలని ఎమ్మెల్యే బాల్కసుమన్.. సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. 

టెట్ ఎగ్జామ్ ల నిర్వాహణ 11 జిల్లా కేంద్రాల్లోన్నే కాకుండా 33 జిల్లా కేంద్రాల్లో నిర్వహించాలని లేఖలో పేర్కొన్నారు. భారీగా ఫీజులు ఉండటంతో పేద,మధ్యతరగతి అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు, టెట్ కు ఫీజులు కట్టలేక ఆర్థికంగా సతమతమవుతున్నారని, వెంటనే దీనిపై చర్యలు తీసుకొవాలని లేఖలో కోరారు.

Read More: Girls Romance In Metro: మెట్రోలో ముద్దులు పెట్టుకుంటూ అమ్మాయిల రొమాన్స్..

అదే విధంగా.. దీని వల్ల 7 లక్షల మంది అభ్యర్థులకు న్యాయం జరుగుతుందని అన్నారు.వెంటనే సీఎం ప్రత్యేక చొరవ చూపించి టెట్ అభ్యర్థుల పట్ల సానుకూలంగా స్పందించాలని మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ సీఎం రేవంత్ రెడ్డికి రాసిన లేఖలో పేర్కొన్నారు. 

 

  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News