తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి (CoronaVirus cases in Telangana) నివారణ చర్యలు, కోవిడ్19 పరీక్షలు, చికిత్సలపై రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ (CM KCR) మంగళవారం సమీక్ష నిర్వహించారు. కరోనా నిర్ధారిత పరీక్షలు, ప్రభుత్వం అందిస్తున్న వైద్యం, తీసుకుంటున్న జాగ్రత్తలపై పూర్తి వాస్తవాలను, ఖచ్చితమైన సమాచారాన్ని హైకోర్టుకు అఫిడవిట్ రూపంలో సమర్పించాలని ఉన్నతాధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. హైకోర్టు (Telangana High Court) అడిగిన ప్రతి వివరాలను కచ్చితంగా తెలపాలని కోరారు. IPL 2020: యూఏఈలోనే ఐపీఎల్ 2020.. 3 వేదికలు
కరోనా వైరస్ వ్యాప్తి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, వైద్య సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేస్తున్నప్పటికీ కొందరు హైకోర్టును ఆశ్రయిస్తున్నారని వైద్యశాఖ అధికారులు కేసీఆర్‌తో చెప్పారు. పేషెంట్లకు వైద్యం అందించడానికి బదులుగా హైకోర్టు విచారణ కోసం సమయం కేటాయించాల్సి వస్తుందని, దీనివల్ల మెరుగైన సేవలు అందించేందుకు ఆటంకాలు తలెత్తుతున్నాయని సీఎం కేసీఆర్‌తో అన్నారు. హాట్ మోడల్, ఫుట్‌బాల్ రిఫరీ ఫొటోలు వైరల్
నిత్యం వేల సంఖ్యలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నామని, ఎంత మందికైనా చికిత్స అందించేందుకు వైద్యశాఖ సిబ్బంది సిద్ధంగా ఉందని సీఎంకు వివరించారు. అయితే కొందరి పిటిషన్ల కారణంగా హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేయడం బాధిస్తోందని వాపోయారు. పొరుగు రాష్ట్రాలతో పోల్చితే కరోనాను సకాలంలో నియంత్రించామని, కరోనా వ్యాప్తి సాధ్యమైనంత వరకు అడ్డుకుంటున్న రాష్ట్రం తెలంగాణ అని, మరణాల సంఖ్య సైతం ఇక్కడ తక్కువగా ఉందని సీఎం కేసీఆర్‌కు అధికారులు వివరించారు. వర్మ సెక్సీ హీరోయిన్ Apsara Rani Hot Stills వైరల్
జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..