KT Rama Rao Rythu Deeksha: 'ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని రేవంత్ రెడ్డి నిలబెట్టుకోవాలి. అవి అమలు చేసే వరకు మేము వెంటాడుతూనే ఉంటాం. రైతులు.. వృద్ధులు.. మహిళల పక్షాన రేవంత్ ప్రభుత్వాన్ని వెంటాడుతాం' అని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేస్తున్న రేవంత్ రెడ్డిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. అన్ని జిల్లాల్లో పోరుబాట కొనసాగిస్తామని ప్రకటించారు.
Also Read: KTR ED Probe: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సంక్రాంతి ఆఫర్.. ప్లేస్.. డేట్ చెప్పాలని సవాల్
ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసానికి వ్యతిరేకంగా శుక్రవారం చేవెళ్ల నియోజకవర్గం షాబాద్‌లో రైతు దీక్ష నిర్వహించారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, ముఠా గోపాల్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితోపాటు పార్టీ నాయకులు పట్లోళ్ల కార్తీక్ రెడ్డితో కలిసి కేటీఆర్ రైతు దీక్షలో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ రైతులకు కేసీఆర్ ప్రభుత్వం చేసిన మేలును గుర్తుచేస్తూనే రేవంత్ రెడ్డి మోసాలను పూసగుచ్చినట్టు కేటీఆర్ వివరించారు.
Also Read: TPCC Women Wing: రేవంత్ రెడ్డికి మహిళల బిగ్ షాక్.. పదవుల కోసం గాంధీ భవన్ వేదికగా వార్నింగ్
రైతు దీక్షలో కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 5 లక్షల మంది ఆడబిడ్డలకు రేవంత్ రెడ్డి రూ.70 వేల కల్యాణలక్ష్మీ తులం బంగారం బాకీ ఉన్నాడు. ఒక్కో రైతుకు ఎకరానికి రూ.17,500 రైతుబంధు పైసలు ఇవ్వాలి' అని కేటీఆర్ గుర్తుచేశారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నాయకులను ప్రజలు ఈ బాకీలు తీర్చమని డిమాండ్ చేయాలని సూచించారు. రేవంత్ రెడ్డి కి సిగ్గు శరం లేదు ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు చెబుతున్నాడని మండిపడ్డారు.
సర్పంచ్, జడ్పీటీసీ ఎన్నికల్లో ఓట్ల కోసం కాంగ్రెసోళ్లు మీ ఇండ్లకు వస్తారు..
రేవంత్ రెడ్డి రైతు భరోసా కింద ఎకరానికి ₹17,500 చొప్పున బాకీ ఉన్నాడని, బాకీ ఉన్నోడ్ని అడిగినట్టు గల్లా పట్టుకుని అడగండి.
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ pic.twitter.com/9TAcvR1Esb
— KTR News (@KTR_News) January 17, 2025
పెద్ద జోక్
'తెలంగాణ మొత్తం ఉద్ధరించిన ఇక ఢిల్లీలో కూడా ఉద్ధరిస్తా. నా మాట నమ్మి ఢిల్లీలో కాంగ్రెస్‌కు అధికారం ఇవ్వండి అని రేవంత్ రెడ్డి ఢిల్లీలో చెప్పడం పెద్ద జోక్. అవ్వకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా? గూట్ల రాయితీనోడు ఏట్లో రాయి తీస్తాడా? తెలంగాణను ఉద్ధరించనోడు ఢిల్లీల ఉద్దరిస్తాడా? ముఖ్య మంత్రి అనే వ్యక్తి ఇన్ని అబద్దాలు చెప్పొచ్చా?' అని కేటీఆర్ వెల్లడించారు. రేవంత్ రెడ్డి అబద్దాలు వింటున్న తెలంగాణ ఆడబిడ్డలు కోపానికొస్తున్నారని చెప్పారు.
బకెట్ల నీళ్లు తెచ్చుకొని మునిగి
'6 గ్యారంటీలు అన్నడు కానీ అర గ్యారెంటీ మాత్రమే అమలైంది. జనాలు తిట్టే తిట్లు వింటే రేషమున్నోడు ఎవరైనా ఒక బకెట్ల నీళ్లు తెచ్చుకొని మునిగి సస్తారు. కానీ రేవంత్ రెడ్డి కి సిగ్గు శరం లేదు ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు చెప్తాడు. తెలంగాణ ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విడిచిపెట్టం' అని మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. రూ.2 లక్షల రుణమాఫీ ఫైల్ మీద సంతకం పెడతా అన్నాడు కానీ రుణమాఫీ కాలేదని గుర్తుచేశారు.
రాష్ట్రంలో ఏ ఊరికైనా సరే.. డేట్, ప్లేస్, టైమ్ నీ ఇష్టం.. నువ్వు కాకపోతే నీ మంత్రులను పంపించు. వంద శాతం రుణమాఫీ అయిందని రాసిస్తే మొత్తం బీఆర్ఎస్ నేతలు రాజీనామా చేసి పోతాం.
రేవంత్ రెడ్డికి కేటీఆర్ దమ్మున్న సవాల్ 🔥 pic.twitter.com/va4FrdhpFl
— KTR News (@KTR_News) January 17, 2025
నిరూపిస్తే రాజకీయ సన్యాసం
'రేవంత్ రెడ్డి సొంతూరు కొండారెడ్డిపల్లెలో.. ఆయన సొంత నియోజకవర్గం కొడంగల్‌లోని ఒక్క ఊర్లో అయినా రైతులకు వంద శాతం రుణమాఫీ అయిందని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ముఖం మీదనే చెప్పిన. నా ఛాలెంజ్‌కు రేవంత్ నుంచి సమాధానం రాలేదు' అని కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలోని ఏ ఊర్లో అయినా రైతులు వంద శాతం రుణమాఫీ అయిందని చెప్తే మొత్తం బీఆర్ఎస్ పార్టీ నాయకులం రాజీనామా చేస్తామని సంచలన ప్రకటన చేశారు. చారాణా కోడికి బారాణా మసాలా అన్నట్టు తెలంగాణలో రుణమాఫీ కాకున్నా ఢిల్లీకి పోయి రుణమాఫీ మొత్తం చేసిన అని రేవంత్ గప్పాలు కొడుతున్నాడని మండిపడ్డారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.