Telangana | తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఢిల్లీకి బయల్దేరారు. అయితే ఆయన షెడ్యూల్ విషయంలో అధికారుల నుంచి ఎలాంటి క్లారిటీ లేదు. ఢిల్లీలో ఆయన మరో మూడు రోజుల పాటు అధికారిక పర్యటన కొనసాగించనున్నారు అని సమచారం. ఎయిమ్స్‌లో పంటి చికిత్స కోసం ఇప్పటికే ఒక ప్రముఖ డెంటిస్ట్ వద్ద అపాయింట్‌మెంట్ తీసుకున్నారు కేసీఆర్.
Also Read | Rythu Bandhu: త్వరలో మరో విడత రైతు బంధు ప్రారంభం
అనంతరం తెలంగాణ రాష్ట్ర సమితీ (TRS) కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించిన స్థలంలో ఆయన భూమిపూజ నిర్వహించనున్నారు. సీఎం కేసీఆర్ (CM KCR) పర్యటన మూడు రోజుల పాటు కొనసాగనుండగా ఆయన పలువురు ప్రముఖులతో సమావేశాలు నిర్వహించనున్నారు. అందులో భారతదేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఇతర మంత్రలు కూడా ఉన్నారు. ఈ భేటీలో తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై చర్చలు జరపనున్నట్టు తెలుస్తోంది.
అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎపాయింట్‌మెంట్ తీసుకోలేదు అని సమాచారం. దీన్ని బట్టి ఇక వారి మధ్య ఎలాంటి భేటీ జరగే అవకాశం లేదు అని తెలుస్తోంది. అయితే కొత్తగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ జాతీయ స్థాయిలో రైతులు చేపట్టిన ఉద్యమానికి కేసీఆర్ మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. ఈ సమయంలో కేసీఆర్ ఢిల్లీ ప్రాధాన్యత సంచరించుకుంది.
Also Read | ఈ కొత్త ATM,Banking రూల్స్ తెలియపోతే ఇబ్బంది పడతారు వెంటనే చదవండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe