Teenmar Mallanna: తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ మంత్రి సీతక్క. కులగణన నివేదికకు నిప్పు పెట్టడం దారుణమైన విషయమని మండిపడ్డారు. నవీన్ గెలుపు కోసం తాము ఎంతగానో కష్ట పడ్డామని గుర్తు చేశారు. నవీన్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారో.. లేదో ఆయనే డిసైడ్ చేసుకోవాలని కామెంట్ చేశారు. అదేవిధంగా కులగణనలో తప్పులు జరిగాయంటూ అసెంబ్లీలో ఆరోపణలు గుప్పించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఆమె స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
తలసాని శ్రీనివాస్ యాదవ్ పద్మారావులు కులగణన సర్వేలో పాల్గొనలేదని ఆరోపించారు. సర్వేలో భాగస్వాములు కాని వారికి కులగణనపై మాట్లాడే నైతిక అర్హత లేదని ఫైర్ అయ్యారు సీతక్క. మరోవైపు రెడ్డిలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్న పై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని రెడ్డి సంఘం నాయకులు డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో వారు మీడియా సమావేశం నిర్వహించారు. గౌరవప్రదమైన పదవిలో ఉన్న చింతపండు నవీన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. వెంటనే తీన్మార్ మల్లన్న తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు .
ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..
దమ్ముంటే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి రెడ్డిల ఓటు లేకుండా గెలవాలని సవాలు విసిరారు. రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పై పార్టీ పరంగా చర్యలు తీసుకోవాలన్నారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?
ఇదీ చదవండి: గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.