Weather updates: 29న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం 

ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ఇంకా తేరుకోని తెలుగు రాష్ట్రాలకు మరో అల్పపీడన ముప్పు పొంచి ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా సంభవించిన వరదలతో హైదరాబాద్ (Hyderabad Flood) నగరం అస్తవ్యస్తంగా మారింది. ఈ క్రమంలో తెలంగాణ (Telangana) రాష్ట్రంలో రాగ‌ల మూడు రోజుల్లో వాతావ‌ర‌ణ పరిస్థితులపై హైద‌రాబాద్ (IMD)వాతావ‌ర‌ణ కేంద్రం సోమవారం ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.

Last Updated : Oct 27, 2020, 06:59 AM IST
Weather updates: 29న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం 

low pressure in the bay of bengal around october 29: హైద‌రాబాద్: ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ఇంకా తేరుకోని తెలుగు రాష్ట్రాలకు మరో అల్పపీడన ముప్పు పొంచి ఉంది. వారం క్రితం కురిసిన భారీ వర్షాలతో ( Heavy rains ) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అతలాకుతలైన సంగతి తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా సంభవించిన వరదలతో హైదరాబాద్ (Hyderabad Flood) నగరం అస్తవ్యస్తంగా మారింది. ఈ క్రమంలో తెలంగాణ (Telangana) రాష్ట్రంలో రాగ‌ల మూడు రోజుల్లో వాతావ‌ర‌ణ పరిస్థితులపై హైద‌రాబాద్ (IMD) వాతావ‌ర‌ణ కేంద్రం సోమవారం ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. రాగ‌ల రెండు, మూడు రోజుల్లో రాష్ర్టం నుంచి నైరుతి రుతుప‌వ‌నాల ఉప‌సంహ‌ర‌ణ‌కు అనుకూల ప‌రిస్థితులు ఏర్ప‌డిన‌ట్లు వెల్ల‌డించింది. ఈ క్రమంలోనే ఉపరితల ఆవర్తనం దృష్ట్యా ఈ నెల 29న (గురువారం) మధ్య బంగాళాఖాతం, ఉత్త‌ర అండమాన్‌లో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. 

ఆగ్నేయ బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతంలో 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. దీనివల్ల బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే.. రానున్న మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణమే ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. Also Read | Covid-19 Vaccine: హైదరాబాద్ నిమ్స్‌లో కరోనా వ్యాక్సిన్ పేస్-3 ట్రయల్స్

ఇదిలా ఉంటే.. ఈశాన్య రుతుపవన వర్షాలు (Northeast monsoon rains) ఈనెల 28న పలు రాష్ట్రాల్లో ప్రారంభం కానున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ముందుగా కేరళ రాష్ట్రంతో పాటు తమిళనాడు, పుదుచ్చేరి, కోస్తాంధ్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ఇవి ప్రారంభమవుతాయని తెలిపింది. రేపటికల్లా దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి కూడా నైరుతి రుతుపవనాల ఉపసంహరణ పూర్తయ్యే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. Also Read | YSR Badugu Vikasam: వైఎస్సార్ బడుగు వికాసం కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News