Vande Bharat Sleeper: ఎప్పుడెప్పుడా అని నిరీక్షిస్తున్న వందేభారత్ స్లీపర్ రైళ్లకు డిమాండ్ భారీగానే కన్పిస్తోంది. దేశవ్యాప్తంగా వివిధ మార్గాల్లో వందేభారత్ స్లీపర్ రైళ్లు ప్రవేశపెట్టాలని ఆయా రాష్ట్రాల్నించి ప్రతిపాదనలు రైల్వే శాఖకు చేరాయి. ఇందులో భాగంగానే ఏపీలో మూడు వందేభారత్ స్లీపర్ రైళ్లకై డిమాండ్ ఉంది. ఇందులో ముఖ్యమైంది విజయవాడ టు అయోధ్య.
ఆంధ్రప్రదేశ్-తెలంగాణ రాష్ట్రాల్లో వందేభారత్ రైళ్లకు మంచి ఆదరణ ఉంది. రైల్వే శాఖ ఆశించిన స్థాయిలోనే ఆక్సుపెన్సీ కొనసాగుతోంది. ముఖ్యంగా విశాఖ-సికింద్రాబాద్ మధ్య రెండు వందేభారత్ రైళ్లు, విజయవాడ నుంచి చెన్నై, సికింద్రాబాద్ నుంచి తిరుపతి, కాచీగూడ నుంచి యశ్వంత్ పూర్‌కు నడుస్తున్న వందేభారత్ స్లీపర్ రైళ్లు మంచి ఆక్సుపెన్సీ కలిగి ఉన్నాయి. త్వరలో పట్టాలెక్కనున్న వందేభారత్ స్లీపర్ రైళ్ల కోసం రెండు తెలుగు రాష్ట్రాల ఎంపీల నుంచి రైల్వే శాఖకు ప్రతిపాదనలు వెళ్లాయి. ముఖ్యంగా విశాఖపట్నం, తిరుపతి నుంచి బెంగళూరుకు, విజయవాడ నుంచి అయోధ్య, వారణాసికు వందేభారత్ స్లీపర్ రైళ్లు కేటాయించాలని రైల్వే మంత్రికి ప్రతిపాదనలు అందాయి. ఇందులో విజయవాడ-బెంగళూరు వందేభారత్ రైలుపై అధ్యయనం కొనసాగుతోంది.
వందేభారత్ స్లీపర్ రైలుకై దేశవ్యాప్తంగా వస్తున్న ప్రతిపాదనల్ని పరిగణలో తీసుకుని డిమాండ్, ఆక్సుపెన్సీ అంచనాలను బట్టి ఆయా మార్గాల్లో వందేభారత్ స్లీపర్ రైళ్లు కేటాయించనున్నారు. ఇందులో భాగంగా ఏపీలో విజయవాడ నుంచి అయోధ్య, వారణాసి వందేభారత్ స్లీపర్ రైలుకు మొదటి ప్రాధాన్యత దక్కవచ్చని తెలుస్తోంది. వందేభారత్ స్లీపర్ రైలు పట్టాలెక్కిన వెంటనే రెండో దశలోనే విజయవాడ టు అయోధ్య వందేభారత్ స్లీపర్ రైలు కేటాయింపు ప్రకటన ఉండవచ్చు. ఈ రైలును వరంగల్ మీదుగా రెగ్యులర్ మార్గంలో ఉండేలా కసరత్తు చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.