Ys Viveka Murder Case: అవినాష్ రెడ్డికి షాక్, ముందస్తు బెయిల్ విచారణకు సుప్రీంకోర్టు నో

Ys Viveka Murder Case: వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డికి మరోసారి షాక్ తగిలింది. ముందస్తు బెయిల్ పిటీషన్ విచారణకు సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ నిరాకరించింది. మరోవైపు కర్నూలు ఎస్పీకు ఇచ్చిన సమాచారంతో అరెస్టుకు రంగం సిద్ధం చేసుకుంది సీబీఐ.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 22, 2023, 12:40 PM IST
Ys Viveka Murder Case: అవినాష్ రెడ్డికి షాక్, ముందస్తు బెయిల్ విచారణకు సుప్రీంకోర్టు నో

Ys Viveka Murder Case: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అవినాష్ రెడ్డి అరెస్టుకు సీబీఐ సిద్ధమైంది. ఈ మేరకు కర్నూలు ఎస్పీకు కూడా లిఖితపూర్వక సమాచారమిచ్చింది. మరోవైపు ముందస్తు బెయిల్ పిటీషన్ విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించడంతో ఇక అరెస్టు తప్పదని తెలుస్తోంది. వెరసి కర్నూలులో నెలకొన్న హై టెన్షన్ మరింత పెరిగింది.

వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డిని ఇక సీబీఐ అరెస్టు చేయడం ఖాయమేనని తెలుస్తోంది. ఇప్పటికే వరుసగా రెండుసార్లు అంటే ఈ నెల 16, 19వ తేదీల్లో సీబీఐ నోటీసులివ్వగా వివధ కారణాలతో గైర్హాజరయ్యారు. ఇవాళ వరుసగా మూడవసారి విచారణకు నోటీసులు అందిస్తే తల్లి అనారోగ్యం దృష్ట్యా హాజరుకాలేనని స్పష్టం చేస్తూ మరో వారం రోజుల గడువు కావాలని ఎంపీ అవినాష్ రెడ్డి లేఖ రాశారు. దీనికి సమాధానమివ్వని సీబీఐ కర్నూలు చేరుకుంది. కర్నూలు ఆసుపత్రి పరిసరాల్లో కూడా బయటి వ్యక్తులు రాకుండా భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆసుపత్రికి చేరుకున్న అవినాష్ రెడ్డి అనుచరులు, మద్దతుదారుల్ని పోలీసులు చెదరగొట్టారు. అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తున్నామని కర్నూలు ఎస్పీకు సైతం సీబీఐ సమాచారమందించింది. 

ఈలోగా తల్లి అనారోగ్యం, తండ్రి జ్యుడీషియల్ కస్టడీ నేపధ్యంలో తల్లిని చూసుకునేందుకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో మరోసారి ముందస్తు బెయిల్ దాఖలు చేశారు అవినాష్ రెడ్డి. అయితే ఈ పిటీషన్ ఇప్పుడు విచారించలేమని సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ స్పష్టం చేసింది. కోర్టు రిజిస్ట్రార్‌ను కలవాలని ధర్మాసనం సూచించింది. రేపు మరోసారి వెకేషన్ బెంచ్‌కు వెళ్లే ఆలోచనలో అవినాష్ రెడ్డి న్యాయవాదులున్నారు. 

ఈ పరిణామాల నేపధ్యంలో అవినాష్ రెడ్డి అరెస్టు తప్పదని తెలుస్తోంది. అయితే కర్నూలు విశ్వభారతి ఆసుపత్రిలో ఉన్న అవినాష్ రెడ్డి తల్లి ఆరోగ్యం విషమంగానే ఉందని ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. మరి కొద్దిరోజులు ఐసీయూలోనే చికిత్స అందించాల్సి ఉందని చెప్పారు. ప్రస్తుతం గుండె 2 కవాటాలు పనిచేయడం లేదని వైద్యులు తెలిపారు ఈ క్రమంలో అవినాష్ రెడ్డి అరెస్టుకు ముందుకు వెళ్తుందా లేదా మరోసారి నోటీసులిస్తుందా అనేది చూడాలి.  

Also read: Avinash Reddy Arrest: కర్నూలులో హై టెన్షన్, ఏ క్షణంలోనైనా అవినాష్ రెడ్డి అరెస్టు, ఉన్నతాధికారుల ఆదేశాలకై ఎదురు చూస్తున్న సీబీఐ

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News